కార్లపై ఎక్సైజ్ సుంఖం పెంచాలని యోచిస్తున్న సర్కారు!?

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఎక్సైజ్ డ్యూటీ సవరణకు సంబంధించి, అధికారులు ఇప్పటికే పలు సలహాలను ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ భారత్‌కు చేరుకున్న తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేగనుక జరిగితే, ఇప్పటికే మందకొడిగా సాగుతున్న ఆటో మార్కెట్‌కు బ్రేకులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్సైజ్ సుంఖం పెంచితే కార్ల అమ్మకాలు తగ్గుతాయి. అలాగే, కార్ల అమ్మకాలు తగ్గితే ఎక్సైజ్ సుంఖం కూడా తగ్గుతుంది. మరి ఈ రెండింటినీ ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








