హోండా సిటీ ధరలో మరోసారి కోత ఉండనుందా?

2012 Honda City
జపాన్ ఆటో దిగ్గజం హోండా భారత మార్కెట్లో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మిడ్-సైజ్ సెడాన్ 'సిటీ' ధరను ఇటీవల భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సెగ్మెంట్లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా ఫ్లూయిడిక్, కొత్త ఫోర్డ్ ఫియస్టా, మారుతి ఎస్ఎక్స్4 వంటి మోడళ్ల నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సిటీ సెడాన్ కారుపై హోండా సియోల్ రూ.66,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది.

అయితే, సిటీ సెడాన్ కారుపై హోండా మరోసారి ధర తగ్గింపును ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. హోండా సిటీలో కొత్త వెర్షన్ వస్తుండటమే. హోండా జాజ్ మీకు గుర్తుండే ఉంటుంది. కొత్త జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసేందుకు గానూ, దాని ముందు మోడల్‌పై సుమారు రూ.1,75,000 డిస్కౌంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే, హోండా సిటీ మోడల్‌లో విడుదల కానున్న కొత్త వేరియంట్ కారణంగా ప్రస్తుతం ఉన్న సిటీ సెడాన్ కారుపై కంపెనీ డిస్కౌంట్‌ను ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2012 ఫేస్‌లిఫ్ట్ హోండా సిటీను కంపెనీ థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించింది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హోండా ఈ కొత్త సిటీ సెడాన్‌ను భారత్‌లో ఆవిష్కరించే అవకాశం ఉంది.

మరోవైపు ఇదే సెగ్మెంట్లో నిస్సాన్ విడుదల చేసిన సన్నీ సెడాన్ ధరలో సిటీకు గట్టి పోటీ ఇవ్వడాన్ని బట్టి చూస్తే.. సిటీ సెడాన్ ధరలు మరికాస్త దిగివచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ.. ఈ విషయంపై కంపెనీ అధికారికంగా ఒక ప్రకటన జారీ చేయాల్సి ఉంది. భారత్‌లో హోండా సియోలో మొత్తం అమ్మకాలలో సిటీ సెడాన్ కార్లే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సిటీ సెడాన్ పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 3, 2011, 13:19 [IST]
English summary
Experts predict that, there is possibility of another price cut on Honda's largest selling sedan City due to facelift version of this model. Honda unveils the 2012 Honda City facelift in Thailand recently. It is speculated that, Honda will launch the 2012 Honda City sedan in India by early next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+