పీటర్ హానెగ్ నేతృత్వంలో మెర్సిడెస్ బెంజ్ ఫేట్ మారేనా..!?

Mercedes-Benz
125 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారత్‌లో గత పదేళ్లుగా అగ్రగామిగా నిలుస్తూ వచ్చింది. అయితే, గతేడాది అనుకోకుండా జర్మనీకు చెందిన మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బిఎమ్‌డబ్ల్యూ' విక్రయాల్లో బెంజ్‌ను అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్పోయిన తన మొదటి స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని మెర్సిడెస్ బెంజ్ తాపత్రయపడుతోంది. చైనాలో మెర్సిడెస్ బెంజ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పీటర్ హానెగ్ ఈ ఏడాది ఆరంభంలో మెర్సిడెస్ బెంజ్ భారత కార్యకలాపాలను చేపట్టారు. హానెగ్ చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు కంపెనీని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారు. దీంతో భారత్‌లో కూడా హానెగ్ నేతృత్వంలోని మెర్సిడెస్ బెంజ్ తన పూర్వవైభవాన్ని తెచ్చుకోగలదని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

హానెగ్ ఓ ఆంగ్ల పత్రికు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. భారత్‌ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, భవిష్యత్తులో నెం.1 లేదా నెం.2 ప్యాసింజర్ కార్ మార్కెట్‌గా ఎదిగుతుందని చెప్పారు. అయితే ఇది 2015 నాటికి జరుగుతుందా లేక 2020 నాటికి జరుగుతుందా అనేదే ప్రశ్న అని ఆయన అన్నారు. దశాబ్ధ కాలంలో భారత మార్కెట్లో దాదాపు 60,000 యూనిట్లను మెర్సిడెస్ బెంజ్ విక్రయించిందని, దేశంలో కొత్తగా పెరుగుతున్న ధనికుల వల్ల వృద్ధి మరింత పెరుగే అవకాశం ఉందని హానెగ్ అభిప్రాయపడ్డారు. భారత లగ్జరీ కార్ మార్కెట్లో పోటీ నానాటికీ పటిష్టమవుతోందని, అయినప్పటీ తమ కార్లకు 125 సంవత్సరాల చరిత్ర ఉందని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అందిస్తున్నామని ఆయన తెలిపారు. తమ కార్లు సురక్షితకు మరియు విలాసానికి పెట్టింది పేరని, తమ వద్ద చాలా చాలా సెక్సీ కార్లు ఉన్నాయని హానెగ్ అన్నారు.

అలాగే, పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకొని, కొనుగోలుదారులు డీజిల్ కార్ల వైపు మొగ్గు చూపుతుండంటంతో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో డీజిల్ కార్లను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని హానెగ్ చెప్పారు. తమ పోటీదారుల కన్నా ఎక్కువగా మెర్సిడెస్ బెంజ్ పెట్రోల్ కార్లను విక్రయిస్తుందని ఆయన తెలిపారు. అలాగే, మార్కెట్లో విక్రయాలను పెంచుకునేందుకు డీలర్‌షిప్ నెట్‌వర్క్‌‌ను కూడా విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్‌కు 50కు పైగా అవుట్‌లెట్లు ఉండగా, ఈ సంఖ్యకు అదనంగా ఏటా 10-15 అవుట్‌లెట్లను జోడించనున్నామని, ఈ విస్తరణలో భాగంగా టైర్ 2, టైర్ 3 నగరాలను కూడా కవర్ చేయనున్నట్లు హానెగ్ చెప్పారు. మరోవైపు బిఎమ్‌డబ్ల్యూ కూడా తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకునేందుకు భారీ కసరత్తులు చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 22, 2011, 12:55 [IST]
English summary
German Luxury carmaker Mercedes-Benz was the first foreign car maker to have entered the Indian car market. Despite the early bird advantage, Mercedes-Benz's sales was overtaken by BMW, which entered the Indian scene only five years ago. Mercedes-Benz is now looking at increasing its sales and wresting back its positions as India's top selling luxury carmaker.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+