బాండ్‌పై సంతకం చేస్తేనే ప్లాంటులోనికి అనుమతి: మారుతి

Maruti Labour Issue
పేరుకేమో దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ, కానీ కార్మికుల విషయంలో మాత్రం కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కార్మికుల మరియు యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం నేటితో 10వ రోజుకు చేరుకుంది. ఫలితంగా గడచిన పది రోజులగా ప్లాంటులో ఉత్పత్తి భారీగా క్షీణించింది.

సత్‌ప్రవర్తనతో ఉంటామనే బాండు (గుడ్ కండక్ట్ బాండ్)పై కార్మికులు సంతకం చేస్తేనే లోనికి అనుమతిస్తామని, లేకపోతే ప్లాంటులోనికి అనుంతిచేంది లేదని యాజమాన్యం మొండిపట్టు పట్టింది. కార్మికులు కూడా తమ బెట్టును వదలడం లేదు. గుడ్ కండక్ట్ బాండ్‌పై సంతకం చేసే ప్రసక్తే లేదని కార్మికులు అంటున్నారు.

మారుతి యాజమాన్యం ప్రకారం, కార్మికులు కావాలనే నాణ్యతలేని ఉత్పత్తులు తయారు చేస్తుందని, ఫలితంగా కంపెనీ ఆస్తులకు నష్టం వాటిళ్లుతుందని, అందుకో గుడ్ కండక్ట్ బాండ్‌ను తెరపైకి తెచ్చామని అంటోంది. అయితే, మానేసర్ కార్మికుల ప్రకారం, గడచిన జూన్‌లో 13 రోజుల పాటు సమ్మె చేసినందుకు కంపెనీ ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు.

ఏదేమైనప్పటికీ, ఇరు వర్గాల మొండివైఖరి కారణంగా మానేసర్ ప్లాంటులో ఉత్పత్తికి ఆటకం వాటిళ్లుతోంది. ఈ ప్లాంటులో కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఏ-స్టార్, ఎస్ఎక్స్4 కార్లు ఉత్పత్తు అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంటులో కాంట్రాక్ట్ వర్కర్ల సాయంతో మారుతి పాక్షిక ఉత్పత్తిని ప్రారంభించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 7, 2011, 11:13 [IST]
English summary
Country's largest carmekr Maruti Suzuki India (MSI) said it will not allow the workers and resume the full-scale production at its Manesar plant till they sign on good conduct bonds. With the stand-off continuing without much breakthrough in terms of negotiations between the management and the workers, this might turn out to be longer than the 13 day strike that crippled production June.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+