టాటా నానో రూపు రేఖలు మారనున్నాయి!

Tata Nano 2012
టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానో పట్ల విడుదలకు ముందు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. ఇందుకు చాలానే కారణాలున్నాయి. ఏప్రిల్ 2009లో టాటా నానో కారును లక్ష రూపాయలకే విడుదల చేసినప్పుడు, భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే ఇది అత్యంత చౌక కారుగా చరిత్ర సృష్టించింది.

అయితే, ఆ తర్వాతి కాలంలో వివిధ కారణాల వల్ల దీని ధర పెరగడం, వినియోగదారుల అంచనాలను అందుకోలేక పోవడంతో దీనికి ఆదరణ తగ్గిపోయి అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రస్తుతం గుజరాత్‌లోని సనంద్ ప్లాంటులో టాటా నానో ఉత్పత్తి సగానికి తగ్గించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈ చిన్న కారును ప్రస్తుతం మరింత శక్తివంతంగా, ఆకర్షనీయంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్ది 2012 టాటా నానో పేరుతో సరికొత్త మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. అయినప్పటికీ, టాటా నానో అంటే అదొక ఆటో/టాక్సీ భావన చాలా మంది ప్రజలు/విమర్శకుల్లో పాతుకుపోయింది.

దీనికి ప్రధానం కారణం, టాటా నానో యొక్క డిజైన్. ఈ కారు ఎంత సౌకర్యంగా ఉన్న దీని డిజైన్ పట్ల మాత్రం కొందరు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో టాటా నానో కారును రీడిజైన్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. దీని రీడిజైనింగ్ పనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐసి)కు అప్పగించాలని టాటా మోటార్స్ యోచిస్తోంది.

టాటా మోటార్స్ ఇప్పటి వరకూ సుమారు 1.30 యూనిట్లకు పైగా టాటా నానో కార్లను విక్రయించింది. విద్యార్థులు రూపొందించే వివిధ డిజైన్ల కోసం తమ నానో కారును ఎన్ఐడికు పంపించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ విధంగా సేకరించిన డిజైన్లలో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి వాటిని టాటా నానోకు వర్తింప చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది గనుక విజయవంతం అయితే, టాటా నానో రూపు రేఖలు మారిపోతాయన్నమాట.

More from DriveSpark

Article Published On: Monday, November 28, 2011, 12:43 [IST]
English summary
The Tata Nano got a facelift in November in the form of the 2012 Nano. However the redesign has not been able to make a significant impact as the basic design has remained the same. Further, The Nano does not have the same craze around it when compared to 2009 when it was launched. A completely new Nano can make a greater sales impact than the current version.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+