టాటా నానో కొనుగోలుదారుల్లో మహిళలే అధికం!

టాటా మోటార్స్ 'చీప్ కారు' టాటా నానో కాస్తా.. 'లేడీస్ కారు'గా మారిపోయింది. భారతదేశపు ఐటి రాజధానిగా చెప్పుకునే బెంగుళూరు నగరంలో టాటా నానో కార్లను కొనుగోలు చేస్తున్న వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. టాటా మోటార్స్ అధ్యయనం ప్రకారం, బెంగుళూరులో 22 శాతం మంది మహిళలు టాటా నానో కార్లను కొనుగోలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం టాటా నానో కార్లను కొనుగోలు చేసే వారిలో 10 శాతం మంది మహిళలు ఉన్నారని టాటా పేర్కొంది. భారత దేశంలో అమ్ముడయ్యే అన్ని కార్లలో కేవలం 2 శాతం మంది మాత్రమే మహిళలు కార్లను కొనుగోలు చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

నానా కారు ధర తక్కువగా ఉండటం, డ్రైవ్ చేయడానికి ఎంతో సౌకర్యంగా ఉండటం మరియు స్టైలిష్ లుక్‌ని కలిగి ఉండటం వలన ప్రధానంగా యువతులు నానో కార్లను ఆశ్రయిస్తున్నారని టాటా మోటార్స్ హెడ్ (నానో ప్రోడక్ట్ గ్రూప్) డెల్నా ఆవారీ తెలిపారు.

మరోవైపు మార్కెట్ మందగమనం కారణంగా పడిపోతున్న టాటా నానో అమ్మకాలను పెంచుకునేందుకు, ఈ కారుపై డౌన్‌‌పేమెంట్‌ను కంపెనీ రూ.15,000 లకు తగ్గించింది. మిగిలిన మొత్తాన్ని టాటా మోటార్స్ ఫైనాన్స్, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రుణ సదుపాయంతో చెల్లించే వెసలుబాటును కల్పించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 21, 2011, 17:50 [IST]
English summary
The Tata Nano small car has emerged as a favorite car of women according to a recent study by Tata Motors. The study has revealed that 10 per cent of Nano buyers are women while the percentage of women among car buyers in general is just two per cent. In another startling revelation, more than 20 per cent of the Nano's buyers in Bangalore are women. So one in every five Nano drivers in Bangalore will be ladies.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+