డెక్కన్ చార్జర్స్ అధికారిక టీమ్ పార్ట్‌నర్‌గా యమహా ఇండియా

డెక్కన్ చార్జర్స్ నుంచి కనీసం ముగ్గురు ఆటగాళ్ల సంతకాలు (సిగ్నేచర్స్)ను చిత్రాలను కూడా యమహా వాడుకోవచ్చు. అంతేకాకుండా.. తమ కార్యక్రమాలు, ప్రమోషన్లుకు ఆటగాళ్లను రెండు రోజుల పాటు యమహా ఉపయోగించుకోవచ్చు. ఒక్క ఏడాది పాటు కొనసాగే ఈ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా.. డెక్కన్ చార్జర్స్ ఆటగాళ్లు హెల్మెట్స్, క్యాప్‌లపై యమహా లోగో దర్శనమివ్వనుంది. అత్యంత వీక్షకాదరణ కలిగిన క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత అంతే ఆదరణ కలిగిన క్రీడ ఐపీఎల్ అని, దీని ద్వారా తమ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువ కాగలదని భావిస్తున్నామని ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియన్ చెప్పారు.
హైదరాబాద్ మార్కెట్లో తమకు పటిష్టమైన స్థానం ఉందని ఈ నేపథ్యంలో డెక్కన్ చార్జర్స్‌తో భాగస్వామ్యం తమకు మరింత మేలు చేకూర్చగలదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా.. యమహా ఓ విశిష్టమైన, నమ్మదగి బ్రాండ్ అని, అత్యుత్తమ ప్రతిభకు ఇది నిదర్శనమని, ఇరు భాగస్వాములు ఖచ్చితంగా తమ తమ విభాగాల్లో విజయాన్ని సాధించగలరని డెక్కన్ చార్జర్స్ స్పోర్టింగ్ వెంచర్స్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఈ వెంకట్ రెడ్డి చెప్పారు.


Click it and Unblock the Notifications








