కార్ ఆఫ్ ది ఇయర్ ఫిగో, బైక్ ఆఫ్ ది ఇయర్ యమహా SZ-X

వీవర్స్ చాయిస్ బైక్‌తో పాటు మరో నాలుగు అవార్డులను యమహా సొంతం చేసుకుంది. సృజనాత్మక ఉత్పత్తి, అధునాతన సాంకేతి పరిజ్ఞాలలో హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియాలు మూడు అవార్డులను సొంతం చేసుకొని తమ పేరును నిలబెట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు మైకేల్ బోనేహామ్ మాట్లాడుతూ.. ఈ అవార్డును తమ విలువైన వినియగదారులకు, ఈ గుర్తింపు రావడానికి కారణమైన సిబ్బందింకి అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఫిగో విడుదలయిన 10 నెలల్లోనే 60,000 కార్లు అమ్ముడయ్యాయని, అంతేకాకుండా ఫోర్డ్ అందిస్తున్న అన్ని మోడళ్ల కన్నా ఫిగోనే అత్యధికంగా విక్రయించబడే కారని ఆయన తెలిపారు.
ఇకపోతే ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి కార్లను ప్రవేశపెట్టిన టొయోటా కిర్లోస్కర్ "బెస్ట్ కార్ మ్యానుఫ్యాక్టరర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును దక్కించుకుంది. ప్రతిష్టాత్మక లగ్జరీ కారు అవార్డును బిఎమ్‌డబ్ల్యూ చేజిక్కుంచుకోగా.. టాటా వారి జాగూర్ ఎక్స్ఎస్ ప్రతిష్టాత్మక సిబియూ సెడాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, స్కొడా బెస్ట్ ఎస్‌యూవి ఆఫ్ ది ఇయర్ అవార్డును, కాంపాక్ట్ కార్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు మరో ఐదు అవార్డులను వోల్క్స్‌వ్యాగన్ సొంతం చేసుకుంది. దేశీయ వినియోగదారుల అవసరాలను తీర్చడంలో తాము చేసిన కృషి గుర్తింపే ఈ అవార్డలని వోల్క్స్‌వ్యాగన్ డైరెక్టర్ అన్నారు.


Click it and Unblock the Notifications








