అత్యంత చౌక ధరకే కొత్త 2012 స్విఫ్ట్ డిజైర్ సెడాన్!
మారుతి సుజుకి బ్రాండ్ నుండి వేయి కళ్లతో ఎదురుచూస్తున్న బుజ్జి సెడాన్ నేడు మార్కెట్లో విడుదలయ్యింది. కంపెనీ భారీ విజయం సాధించిన స్విఫ్ట్ బ్రాండ్‌లో నాలుగు మీటర్ల కన్నా తక్కువ ఉండేలా మారుతి సుజుకి ఓ సరికొత్త సెడాన్‌ను, అత్యంత ఆకర్షనీయమైన ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు, తద్వారా దీని ధరను తక్కువగా ఉంచి, ఈ సెగ్మెంట్లోని ఇతర కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కంపెనీ ఈ సరికొత్త మోడల్‌ను రూపొందించింది.
కొత్త 2012 స్విఫ్ట్ డిజైర్ సెడాన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పెట్రోల్ వేరియంట్ 2012 స్విఫ్ట్ డిజైర్ ధరలు:
* 2012 స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ: రూ. 4.79 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ: రూ. 5.32 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ (ఆటోమేటిక్): రూ. 6.54 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ: రూ. 6.19 లక్షలు
డీజిల్ల్ వేరియంట్ 2012 స్విఫ్ట్ డిజైర్ ధరలు:
* 2012 స్విఫ్ట్ డిజైర్ ఎల్‌డిఐ: రూ. 5.80 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ విడిఐ: రూ. 6.31 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డిఐ: రూ. 7.09 లక్షలు
అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. కొత్త 2012 స్విఫ్ట్ డిజైర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









