డిసెంబర్ నెలలో 29 శాతం పెరిగి టాటా నానో సేల్స్

డిసెంబర్ 2011లో దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు (ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు కలిపి) 24 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 61,685 యూనిట్ల నుండి యూనిట్లకు పెరిగాయి. అయితే, డిసెంబర్ 2011 నెలలో ఎగుమతులు మాత్రం 5,809 యూనిట్ల నుండి 5,615 యూనిట్లకు పడిపోయాయి.
ఇదే సమయంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 47 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 19,973 యూనిట్ల నుండి 28,916 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్ అందిస్తున్న బుజ్జి కారు టాటా నానో అమ్మకాలు డిసెంబర్ 2010 నెలతో పోలిస్తే, గడచిన నెలలో 29 శాతం వృద్ధి నమోదు చేసుకొని 7,466 యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 2010లో ఇవి 5,784 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








