నానోకు పూర్వవైభవం: అమ్మకాల్లో అదరగొడుతున్న నానో

టాటా నానో విషయంలో టాటా మోటార్స్ వేసిన "2012" మంత్రా చక్కగా పనిచేసినట్లు తెలుస్తోంది. సరికొత్త రంగులతో, మరిన్ని అదనపు ఫీచర్లను జోడించినప్పటికీ.. ధరను ఏ మాత్రం పెంచకుండా కంపెనీ విడుదల 2012 వెర్షన్ టాటా నానో కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఊపందుకున్నాయి. వరుసగా నాలుగో నెలలో కూడా టాటా నానో అమ్మకాలు అభివృద్ధి బాటలో దూసుకుపోయాయి.

జనవరి నెలలో మొత్తం 7,723 టాటా నానో కార్లు అమ్ముడయ్యాయని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. గడచిన సంవత్సరం ఇదే నెలలో టాటా నానో అమ్మకాలు 6,703 యూనిట్లుగా ఉన్నాయి. కేవలం రూ.15,000 డౌన్‌పేమెంట్‌కే టాటా నానో కారును డెలివరీ చేయడం, ఆకర్షనీయమైన వడ్డీ రేట్ స్కీమ్‌లు, డిస్కౌంట్లు తదితర మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా నానో అమ్మకాలు జోరందుకున్నాయి.

ఇదిలా ఉండగా.. గడచిన జనవరి నెల ఆరంభంలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తమ బుజ్జి కారును రెండు కొత్త వేరియంట్లలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి సిఎన్జీ వేరియంట్. ప్రస్తుతం సిఎన్‌జీ లభ్యత కొన్ని ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ వేరియంట్ అంత త్వరగా ప్రొడక్షన్ రూపంలోకి వచ్చే సూచనలు కనబటం లేదు.

ఇకపోతే.. టాటా నానో డీజిల్ వేరియంట్ కోసం 2011 సంవత్సరంలో వేయి కళ్లతో వేచి చూసిన వారికి నిరాశే మిగిలింది. మరి 2012 సంవత్సరంలో అయినా నానో డీజిల్ వేరియంట్ మార్కెట్లో వస్తుందో లేదో వేచిచూడాల్సి ఉంది. టాటా నానో జోరుకు మరింత వేగాన్ని అందించాలంటే, కంపెనీ ఇందులో మరిన్ని వేరియంట్లను, ఫ్యూయెల్ ఆప్షన్లను విడుదల చేయక తప్పదు. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, February 2, 2012, 12:25 [IST]
English summary
Sales of the Tata Nano were 7,723 nos., higher by 15%, compared to 6,703 nos., sold in January, last year. This is the fourth consecutive month that Nano sales continue to grow.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+