కొత్త ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హ్యుందాయ్

ఈ ఫోటోలో ఉన్న కారును గుర్తుపట్టారా..?? ఇది హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ "హ్యుందాయ్ ఐ20"లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. హ్యుందాయ్ పాపులర్ ఫ్లూయిడిక్ డిజైన్ థీమ్ ఆధారంగా డిజైన్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ ఫోటోలను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న జెనీవా మోటార్ షోలో హ్యుందాయ్ ఈ సరికొత్త ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది.

సరికొత్త హ్యుందాయ్ ఐ20 ముందు భాగాన్ని గమనించినట్లయితే, కంపెనీ పాపులర్ ఫ్లూయిడిక్ డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్‌ను పూర్తిగా సరికొత్త స్టయిల్‌తో రీడిజైన్ చేయటం జరిగింది. ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్, మరింత విశాలమైన చైన్, అప్‌డేట్ చేయబడిన హుడ్ డిజైన్, రీడిజైన్ చేయబడిన రియర్ టెయిల్ ల్యాంప్స్, సరికొత్త రియర్ బంపర్, సరికొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ వంటి మార్పులను కొత్త ఫేస్‌లిఫ్ట్ ఐ20 ఫ్లూయిడిక్‌లో గమనించవచ్చు.

ఇప్పటికే పాత ఐ20 హ్యాచ్‌బ్యాక్ కోసం కొత్త బుకింగ్‌లు తీసుకోవటాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త ఐ20 ఫ్లూయిడిక్ వీలనైంత త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా ప్రవేశించనుంది. ఇక దీని ధర విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఐ20 కన్నా కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఐ20 ఫ్లూయిడిక్ ఇదే సెగ్మెంట్లో లభిస్తున్న కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్, 2012 ఫియట్ గ్రాండే పుంటో, కొత్త హోండా జాజ్ మోడళ్లకు పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 3, 2012, 17:17 [IST]
English summary
Hyundai Motors India has just reveled the photos of the soon-to-be launched i20 facelift with fluidic design. slimmer headlights, hexagonal grille, re-designed front bumper, new fog lamps, new rear bumper, re-profiled tail lamps and new alloy-wheel designs are the major changes in new facelift Hyundai i20.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+