సైలెంట్‌గా కొత్త అవుట్‌లాండర్‌ను విడుదల చేసిన మిత్సుబిషి
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 5-సీటర్ వెర్షన్ అవుట్‌లాండర్‌లోనే వెనుక వైపు సన్నటి పొడవైన సీటును (థర్డ్ రో సీట్) అమర్చి అదనంగా మరో ఇద్దరు ప్రయాణికులకు చోటు కల్పించేలా ఈ కొత్త మోడల్‌ను కంపెనీ డిజైన్ చేసింది. ఏదేమైనప్పటికీ మూడవ వరుస సీట్లో కూర్చేనే వారికి లెగ్‌రూమ్ కాస్తంత ఇరుకుగా అనిపిస్తుంది. ఈ వెనుక సీటును అవసరం లేనప్పుడు మడచుకొని, లగేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు.
ఇంతకు మించి ఈ కొత్త వేరియంట్‌లో ప్రత్యేకమైన మార్పులు ఏవీ లేవు. అన్ని అవుట్‌లాండర్ వేరియంట్లు కూడా 4-సిలిండర్, 2.4 లీటర్, పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తాయి. ఇది 167 బిహెచ్‌పిల శక్తిని, 23 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.6-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో లభించే ఈ ఎస్‌యూవీ కేవలం 10 సెకండ్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా 190 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల జెనీవాలో జరిగిన 82వ అంతర్జాతీయ ఆటో షోలో తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) 'అవుట్‌లాండర్'ను క్రాసోవర్ మిత్సుబిషి ఆవిష్కరించింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్లో సరికొత్త 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటీ గేర్‌బాక్స్‌తో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. డీజిల్ వేరియంట్లో సరికొత్త 2.2 లీటర్ డిఐడి క్లీన్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications









