బడ్జెట్ ఎఫెక్ట్: మారుతి సుజుకి ఎర్టిగా ధర మరింత ప్రియం!

మారుతి సుజుకి ఇండియా నుండి మార్కెట్లోకి విడుదల కానున్న బహుళ ప్రయోజన వాహనం ఎర్టిగా ఎమ్‌పివికు 'ఆదిలోనే హంసపాదు' అన్నట్లుగా బడ్జెట్ ప్రభావంతో దీని ధర మరింత ప్రియం అయ్యే ఆస్కారం ఉంది. యూనియన్ బడ్జెట్ 2012-13లో ప్రభుత్వం తీసుకోనున్న కీలక నిర్ణయాల గురించి ముందుగానే ఆలోచించిన మారుతి సుజుకి ఇండియాలో ఈ ఎమ్‌పివి విడుదలను వాయిదా వేసుకుంది.

ఒకవేళ బడ్జెట్ కన్నా ముందుగా ఎర్టిగాను విడుదల చేసి ఉన్నట్లయితే, బడ్జెట్ అనంతరం మరోసారి ఈ కారు ధరను సవరించాల్సి వచ్చేది. అదే గనుక జరిగి ఉంటే ఎర్టిగా అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉండేది. ఇవన్నీ ఆలోచించిన మారుతి సుజుకి సుజుకి తెలివిగా ఒకేసారి సవరించబడిన ధరతోనే ఎర్టిగాను దేశీయ విపణిలోకి తీసుకురానుంది. అయితే, ఈ ఎమ్‌పివి ధర గతంలో అనుకున్న దాని కన్నా కాస్తంత ఎక్కువగా ఉండనుంది.

ప్రస్తుత బడ్జెట్‌లో పెద్ద కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 22 శాతం నుండి 27 శాతానికి పెంచడం వలన ఎర్టిగా ధర కూడా ప్రభావితం కానుంది. మారుతి సుజుకి తమ ఎర్టిగా ఎమ్‌పివిని వచ్చే నెల 11వ తేదీన వాణిజ్యపరంగా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. ఇండియాలో తయారవుతున్న ఎర్టిగా ఎమ్‌పివిని ఇండోనేషియా మార్కెట్‌కు కూడా ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 17, 2012, 17:45 [IST]
English summary
Maruti Suzuki had postponed the launch of its Ertiga MPV anticipating higher taxes on diesel cars in the union budget of 2012-13. With excise taxes on cars increasing, Maruti Suzuki is expected to launch the Ertiga with a price tag that is higher than previously expected.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+