నేపాల్ రాజుకి హిట్లర్ బహుకరించిన మెర్సిడెస్ బెంజ్ కారు..
పురాతన కార్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రంగా ఉన్న ఆనాటి రోజుల్లో అబ్బురపరచేలా రూపొందించిన వింటేజ్ కార్లను చూస్తే ఔరా అని ముక్కున వేలు వేసుకోవటం ఖాయం. చాలా మంది వింటేజ్ కార్లను కేవలం వాటి అందం, ధీర్ఘకాలిక మన్నిక, క్లాసిక్ లుక్స్ కారణంగా మాత్రమే వాటిని ఇష్టపడరు. అలాంటి కార్ల వెనుక ఉన్న చరిత్ర కూడా ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది.
అందుకే, ఇనుప సామాన్లకు వేసుకోవడానికి పనికిరాని పురాతన కార్లను, వాటిని ఉపయోగించిన వ్యక్తులు, చరిత్రల జ్ఞాపకార్థం కోట్లు వెచ్చించి మరీ వేలంలో కొనుగోలు చేస్తుంటారు కొందరు అభిమానులు. అలాంటి ఓ పురాతన చరిత్ర కలిగిన కారు గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు నాజీ పార్టీ అధినేత అడాల్ఫ్ హిట్లర్, నేపాల్ రాజుకు బహుకరించినది.
1939వ సంవత్సరానికి చెందిన ఈ పురాతన మెర్సిడెస్ కారును నేపాల్ రాజు కింగ్ త్రిభువన్‌కు ఈ జర్మన్ రాజకీయవేత్త కానుకగా సమర్పించాడు. కాఠ్మండులో నిర్మించున్న కొత్త రాయల్ మ్యూజియంలో త్వరలోనే ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ కారు శిధిలావస్థకు చేరుకుని, కాఠ్మండులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఉంది.


Click it and Unblock the Notifications









