నేడు మార్కెట్లోకి రానున్న చెవర్లే తవేరా నియో3 బిఎస్ 4
బిఎస్ 3 వెర్షన్ నియో3ను కేవలం రూ.6.72 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ విడుదల చేసింది. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్, 7-సీటర్ తవేరా నియో3 ధర 10.02 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
తవేరా నియో3 బిఎస్ 3 వేరియంట్‌లో డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 105 బిహెచ్‌పిల శక్తిని, 264 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6, 7, 8, 9, 10 సీటర్ ఆప్షన్‌లతో లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ సైడ్ ఇండికేటర్స్ కలిగిన సరికొత్త హెడ్‌లైట్స్ డిజైన్, ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.
బిఎస్ 3, బిఎస్ 4 తేవరా నియో3లో కేవలం ఇంజన్ మార్పులు ఉండనున్నాయి. మిగిలిన అన్ని ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫీచర్లు ఒక విధంగా ఉంటాయి. కొత్త రిఫ్రెష్డ్ తవేరా నియో3 ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లోని ఇన్నోవా, కొత్త జైలో వంటి మోడళ్లకు మంచి పోటీగా నిలువనుంది. తవేరా నియో3 బిఎస్4 మోడల్‌కు సంబంధిన ధర ఇతర వివరాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications









