మహీంద్రా ఎక్స్‌యూవీ500 డిపాజిట్ అమౌంట్ రీఫండ్
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 కోసం గడచిన జనవరి నెలాఖరులో సెకండ్ ఫేజ్ బుకింగ్‌లను ఓపెన్ చేసినప్పుడు బుకింగ్ అమౌంట్ క్రింద సుమారు రూ.80,000 మొత్తాన్ని కస్టమర్ల నుండి కంపెనీ వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇలా వసూలు చేసిన బుగింగ్ అమౌంట్‌ను కంపెనీ తిరిగి కస్టమర్లకు చెల్లించేస్తోంది.
ఎక్స్‌యూవీ500 కోసం ఓపెన్ చేసిన సెకండ్ ఫేజ్ బుకింగ్స్‌లో ఈ మోడల్‌కు భారీగా ధరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా ప్రాతిపదికన విజేతలను ఎంచుకునేందుకు కంపెనీ డ్రా విధానాన్ని చేపట్టింది. ఇందులో ధరఖాస్తు చేసుకోవడానికి కస్టమర్లు రూ.80,000 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఈ లక్కీ డ్రాలో పాల్గొన్న అభ్యర్థులందరికీ (ఎక్స్‌యూవీ500 డ్రాలో ఎవరి అప్లికేషన్లయితే ఎంపిక కాలేదో వారికి మాత్రమే) మార్చి 15, 2012 నాటికి అప్లకేషన్ డిపాజిట్ మొత్తాలను తిరిగి చెల్లించేశామని కంపెనీ పేర్కొంది. ఒకవేళ ఇంకా ఎవరైనా కస్టమర్లు తమ డిపాజిట్ మొత్తాలను అందుకోనట్లయితే, [email protected] ఈ-మెయిల్ ఐడిపై మెయిల్ చేయటం కానీ లేదా 1800-209-6006 టోల్ ఫ్రీ నెంబర్‌పై ఫోన్ చేయటం కానీ చేయగలరని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications









