గుర్గావ్ డీజిల్ ఇంజన్ ప్లాంటుపై మరో 2 నెలల్లో నిర్ణయం: మారుతి
గుర్గావ్‌లో డీజిల్ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేసే విషయంపై తటపటాయిస్తున్న దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మరో రెండు నెలల్లో ఈ ప్లాంటు గురించి ఓ ఖచ్ఛితమైన నిర్ణయాన్ని వెల్లడించనుంది. బడ్జెట్‌లో డీజిల్ టాక్స్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవటంతో, డీజిల్ కార్ల ఉత్పత్తి పెంపు గురించి వీలైనంత త్వరగా ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం డీజిల్ ఇంజన్ల పరిమిత సరఫరా కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, ఈ నేపథ్యంలో తామే స్వతహాగా డీజిల్ ఇంజన్లను తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, కాబట్టి మరో రెండు నెలల లోపుగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నామని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షింజో నకనిషి తెలిపారు. ప్రస్తుతం సుజుకి పవర్‌ట్రైన్, ఫియట్‌ల నుండి మారుతి డీజిల్ ఇంజన్లను కొనుగోలు చేస్తుంది.


Click it and Unblock the Notifications









