ఈ సంవత్సరంలోనైనా నానో డీజిల్ కల నెరవేరుతుందా..?

Nano Concept
గతకొద్ది కాలంగా టాటా నానో ప్రియులను ఊరిస్తున్న డీజిల్ వేరియంట్ విడుదల దాదాపుగా ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో నానో డీజిల్ వేరియంట్ విడుదలవుతుందని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. దీంతో సిఎన్‌జీ వేరియంట్, నానో కాన్సెప్ట్ కార్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టాటా నానో పెట్రోల్ వేరియంట్ ఇంజన్లను అభివృద్ధి చేయడంలో సహకరిస్తున్న జర్మన్ విడిభాగాల కంపెనీ బోష్, నానో డీజిల్ ఇంజన్ తయారు చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2012-13లో డీజిల్ కార్లపై అధనపు సుంఖాలను విధించకపోవటం వంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాదిలో డీజిల్ వేరియంట్ నానోను ప్రవేశపెట్టాలని టాటా మోటార్స్ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.

లీటరుకు 40 కి.మీ. మైలేజీనివ్వటం నానో డీజిల్ వేరియంట్ ప్రత్యేకత. సాధారణ పెట్రోల్ కార్లు, సాంప్రదాయ ద్విచక్ర వాహనాల రన్నింగ్ కాస్ట్‌తో పోల్చుకుంటే, డీజిల్ వేరియంట్ టాటా నానో ఎన్నో రెట్లు మెరుగని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్ టాటా నానో ఆన్-రోడ్ ధర రూ.1.7 లక్షల నుండి రూ.1.8 లక్షల రేంజ్‌లో ఉండనుంది. డీజిల్ వేరియంట్ నానో ఆన్-రోడ్ ధరలు రూ.2.2 లక్షల నుండి రూ.3 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, March 26, 2012, 17:10 [IST]
English summary
Tata Motors is reportedly planning to launch the diesel variant of its small car, Nano later this year. Reports of a diesel Nano have been doing the rounds since almost a year with many predicting Tata Motors would launch the Tata Nano diesel at the 2012 Delhi Auto Expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+