ఇన్నోవా, ఎర్టిగాలను ఛాలెంజ్ చేయనున్న చెవర్లే ఎంజాయ్
Chevrolet Enjoy MPV Phot Gallery:
గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో జనరల్ మోటార్స్ ఈ చెవర్లే ఎమ్‌పివి ఆవిష్కరించింది. చైనా టైఅప్ నుండి వస్తున్న తొలి ఉత్పత్తి చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ లోవెల్ సి పడ్డాక్ తెలిపారు. ఈ ఎమ్‌పివి పేరును చెన్నైలో అధికారికంగా ప్రకటిస్తున్నామని, ఇది 'ఎంజాయ్' అని, ఈ మోడల్‌ను ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని, ఈ టైఅప్ నుండి వస్తున్న మొదటి ఉత్పత్తి ఇదని పడ్డాక్ తెలిపారు.
చైనా మార్కెట్లో చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి ఇదే పేరుతో లభిస్తుంది. దీనిని చైనా భాగస్వామ్యంతో తయారు చేస్తుండటం వలన భారత మార్కెట్లో దీని ధర చాలా తక్కువగా ఉండనుంది. ఆరు లక్షల రూపాయలకు దిగువన ఈ మోడల్‌ను ప్రవేశపెట్టాలని జనరల్ మోటార్స్ భావిస్తోంది. ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మరో చిన్న కారు సెయిల్‌ను జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అయితే దీని ధరను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
చెవర్లే సెయిల్ ధర రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇక చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి విషయానికి ఇది తొలుతగా 94.6 బిహెచ్‌పి సామర్థ్యం కలిగిన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తోనూ, అనంతరం 1.3 లీటర్ ఎస్‌డిఈ డీజిల్ ఇంజన్‌తోనూ లభ్యం కానుంది. ఈ ఎమ్‌పివి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications









