కొత్త హ్యుందాయ్ ఐ20 ఫ్లూయిడిక్ గురించి మరిన్ని సీక్రెట్స్
అతి త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదల కానుంది. హంగు ఆర్భాటాలు లేకుండా సాధాసీదా సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఐ20ను హ్యుందాయ్ మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తుంది. ఇటీవల జరిగిన జెనీవా మోటార్ షోలో కంపెనీ తమ సరికొత్త ఐ20 ఫ్లూయిడిక్‌ను ఆవిష్కరించింది.
ఫేస్‌లిఫ్ట్ ఐ20 ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తోనూ, 1.4 లీటర్ పెట్రోల్ వేరియంట్లో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తోనూ మార్కెట్లోకి రానుంది.
ఫేస్‌లిఫ్ట్ ఐ20 మొత్తం 9 వేరియంట్లలో విడుదల కానుంది. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ స్పోర్ట్జ్‌లో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. కొత్త ఐ20లో ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్, స్టయిలిష్ స్టీరియో సిస్టమ్, సరికొత్త సీటింగ్, డార్క్ గ్రే ఇంటీరియర్స్ వంటి ఫీచర్లతో పాటుగా ఇది ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications









