డీజిల్ కార్ల అభివృద్ధి కోసం హోండా భారీ పెట్టుబడులు
జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా తమ భారత అనుబంధ సంస్థ హోండా సియోల్ కార్స్ ఇండియాలో రూ.1,200 కోట్ల పెట్టుబడులను వెచ్చింది. ఈ తాజా పెట్టుబడులను రాజస్థాన్‌లో తపుకరా మ్యానుఫాక్చరింగ్ ప్లాంటును అభివృద్ధి చేయడానికి, అలాగే ఇండియాలో డీజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టానికి కంపెనీ ఉపయోగించనుంది.
జపాన్‌కు చెందిన హోండా, ఇండియాకు చెందిన సియోల్ కార్స్ రెండు కంపెనీలు కలిసి భారత్‌లో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్‌లో హోండా 95 శాతం వాటా ఉండగా, సియోల్ కార్స్‌కు 5 శాతం వాటా ఉంది. తాజా పెట్టుబడుల కోసం హోండా, సియోల్ జాయింట్ వెంచర్ విడిపోనుందన్న పుకార్లు వస్తున్న నేపథ్యంలో హోండా ఈ రైట్స్ ఇష్యూ ద్వారా పెట్టుబడులను సమకూర్చుతున్నట్లు ప్రకటించడంతో వీటికి తెరపడినట్లయింది.
అయితే, జపాన్ భాగస్వామి హోండా మోటార్ కంపెనీ తాజాగా రూ.1,200 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తుండటంతో ఈ జపాన్-ఇండియా కంపెనీ భాగస్వామ్యం (హోండా సియోల్ కార్స్)లో సియోల్ కార్స్ వాటా 5 శాతం నుండి 3.16 శాతానికి పడిపోయింది. హోండా రూ.10 వద్ద 20.99 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేసింది.


Click it and Unblock the Notifications
