లీటరుకు రూ.6 మేర పెరిగిన ఆటో ఎల్‌పిజి ధరలు

Auto LPG Price Hike
ఆటోమొబైల్ వాహనాలకు ఉపయోగించే ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధర పెరిగింది. ఇకపై ఆటో ఎల్‌పిజిని ఫిల్ చేసుకునే వాహన చోదకులు ప్రతి లీటరుపై అధనంగా రూ.6 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆటో ఎల్‌పిజి ధరను ప్రతి లీటరుపై రూ.6 చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాదిలో ఇలా ఆటో ఎల్‌పిజి ధరలు పెరగటం ఇది మూడవసారి.

తాజా పెంపుతో ఆటో ఎల్‌పిజి ధర రూ.43.65 నుండి రూ.49.72 లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన కారణంగా ఆటో ఎల్‌పిజి ధరలను పెంచక తప్పడం లేదని దేశపు అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయల్ కార్పోరేషన్ (ఐఓసి) వెల్లడించింది. గడచిన మార్చి 1 వ తేదీన కూడా ఆటో ఎల్‌పిజి ధరను ప్రతి లీటరుపై రూ.3 మేర పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో ఆటో ఎల్‌పిజి ధర లీటరుకు రూ.40.7 నుంచి రూ.43.65కు పెరిగింది.

DriveSpark Photo Gallery:

ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలను పెంచేందుకు తమకు అనుమతి ఇవ్వాలని లేదా సబ్సిడీ ధరలపై పెట్రోల్‌ను విక్రయిస్తుండటం వల్ల రోజువారీగా వస్తున్న రూ.48 కోట్ల నష్టానికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. లేకపోతే ఇంధన సరఫరాలు నిలిపి వేస్తామని సర్కారును హెచ్చరించాయి.

వీరి డిమాండ్లకు కేంద్రం స్పందించి నష్టపరిహారాన్ని చెల్లిస్తే సరేసరి. లేకపోయినట్లయితే, పెట్రోల్ సరఫరా నిలిచిపోవడమో లేదా పెట్రోల్ ధరలు అమాంతం రూ.5-8 మేర పెరగడమో జరిగే ఆస్కారం ఉంది. పెట్రోల్‌పై అదనంగా 20 శాతం సేల్స్ టాక్స్ విధించిన తర్వాత ప్రతి లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.7.67 చొప్పున నష్టం వాటిళ్లుతోందని ప్రభుత్వ రంగం చమురు సంస్థలు వాపోతున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 3, 2012, 11:03 [IST]
English summary
State-owned oil firms have hiked auto LPG (Liquefied Petroleum Gas) prices by Rs 6 per litre, the third increase this year. Now Auto LPG, will cost Rs 49.72 per litre as against Rs 43.65 per litre price till last month, according to Indian Oil Corp, the nation's largest fuel retailer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+