టాటా-ఫియట్ దోస్తీ కట్: సోలో రైడ్‌కు ఫియట్ సిద్ధం

టాటా మోటార్స్, ఫియట్ ఇండియాల దోస్తీకి శుభం కార్డు పడింది. గతకొద్ది సంవత్సరాలుగా, టాటా-ఫియట్ రెండు కంపెనీలు కలిసి ఇండియాలో జంటగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇకపై భారత మార్కెట్లో ఒంటరిగానే ప్రయాణించాలని ఫియట్ నిర్ణయించింది. ప్రస్తుతం, టాటా-ఫియట్ సంయుక్త డీలర్‌షిప్ ద్వారా ఫియట్ తమ వాహనాలను ఇండియాలో మార్కెటింగ్ చేస్తుంది.

ఇటలీకి చెందిన ఫియట్ 2007వ సంవత్సరంలో కార్ల పంపిణీ (డిస్ట్రిబ్యూషన్), సర్వీసింగ్‌ల కార్యకలాపాల కోసం టాటా మోటార్స్‌తో ఓ డీల్‌ను కుదుర్చుకుంది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఈ 50:50 జాయింట్ వెంచర్ పంపిణీ భాగస్వామ్యంలో భాగంగా, టాటా మోటార్స్ వాహనాలను విక్రయించే స్థలంలోనే ఫియట్ తమ వాహనాలను కూడా విక్రయిస్తుంది. భారత్‌లో ఫియట్‌ బ్రాండ్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఫియట్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇకపై తమ వాణిజ్య, డిస్ట్రిబ్యూషన్‌ కార్యకలాపాలను కొత్తగా ఏర్పాటు కానున్న ఫియట్‌ అనుబంధ కంపెనీ పర్యవేక్షిస్తుందని ఫియట్ తెలిపింది. అయితే, ఈ రెండు కంపెనీలు కలిసి ఇంజన్లు/కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఒప్పందం మాత్రం యధావిధిగా కొనసాగించేందుకు ఇరు కంపెనీలు అంగీకరించాయి. ఈ జాయింట్ వెంచర్ ఆశించినంతగా ఫలితాలను ఇవ్వటం లేదని టాటా మోటార్స్ చైర్మన్ రతన్ టాటా గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Thursday, May 3, 2012, 15:16 [IST]
English summary
Fiat, the Italian carmaker has finally announced the end of its much disturbed distribution deal with Tata Motors. Fiat which so far had no say in the marketing of its cars in India will now hand over the sales responsibility to a company owned by its parent group Fiat SpA.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+