టీవీఎస్‌ను ఓవర్‌టేక్ చేసి, 3వ స్థానాన్ని ఆక్రమించుకున్న హోండా

Honda Dream Yuga
హీరో హోండా జాయింట్ వెంచర్ నుండి నుండి విడిపోయిన జపాన్ ద్విచక్ర వాహన కంపెనీ హోండా మార్కెట్లో సరికొత్త వ్యూహాలను రచించుకుంటూ, వేగంగా ముందుకు సాగిపోతుంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో అందిస్తున్న మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాధించుకున్నాయి.

ఇందుకు ప్రధాన కారణం, ఈ జపాన్ కంపెనీ అందిస్తున్న ఇంజన్ టెక్నాలజీనే. ఇంజన్ల తయారీలో హోండాకు పెట్టింది పేరు. అందుకే హోండా మోటార్‌సైకిళ్ల డిజైన్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, వీటి ఇంజన్ కారణంగా కొనుగోలుదారులు ఎక్కువగా ఈ బ్రాండ్‌ను ఆశ్రయిస్తున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరం వరకూ దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో నాలుగో స్థానంలో ఉన్న హోండా ప్రస్తుతం
టీవీఎస్‌ను ఓవర్‌టేక్ చేసి మూడవ స్థానంలోకి చేరిందంటేనే మార్కెట్లో ఈ బ్రాండ్‌కు లభిస్తున్న ఆదరణ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

గడచిన ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎమ్ఎస్ఐ మొత్తం 19,96,320 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి తృతీయ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇదే సమయంలో ఇదివరకు తృతీయ స్థానంలో చెన్నైకు చెందిన టీవీస్‌ మోటార్‌ కంపెనీ 18,95,500 ద్విచక్ర వాహనాలను విక్రయించి నాలుగో స్థానానికి పడిపోయింది. అలాగే, ఇదే కాలానికి గానూ దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌ మొత్తం 60,69,280 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి ప్రథమ స్థానంలో నిలువగా, బజాజ్‌ ఆటో 25,66,757 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి ద్వితీయ స్థానంలో నిలిచింది.

కాగా.. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా గడచిన జనవరిలో ఆవిష్కరించిన బడ్జెట్ బైక్ "డ్రీమ్ యుగ", చవక ధర కలిగిన స్పోర్ట్స్ బైక్ "సిబిఆర్ 150ఆర్" మోడళ్లు మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కావటం ప్రారంభమైతే హోండా జోరుకు ఇక బ్రేక్‌లు ఉండవేమో..! మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Wednesday, April 11, 2012, 12:15 [IST]
English summary
Japanese two-wheeler maker Honda Motorcycle & Scooter India (HMSI) has become the third largest two-wheeler maker in the Indian market that stood at 1.34 crore units in 2011-12 by displacing the Chennai-based TVS Motor Company.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+