సూపర్బ్‌లో చవక వేరియంట్‌ను తీసుకువచ్చిన స్కొడా

స్కొడా ఇండియా అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'సూపర్బ్'లో ప్రైజ్ కట్ (ధర తగ్గింపు) వెర్షన్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. స్కొడా సూపర్బ్ యాంబిషన్ వేరియంట్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త మోడల్ ధర ఇది వరకటి బేస్ వేరియంట్ ధర కన్నా రూ.1.5 లక్షలు తక్కువ ధరను కలిగి ఉంటుంది. స్కొడా విడుదల చేసిన ఈ 2012 సూపర్బ్ యాంబిషన్ వేరియంట్‌లో ధరతో పాటుగా కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ తగ్గించటం జరిగింది.

ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ ఫ్లూయిడిక్ సొనాటా, కొత్త టొయోటా క్యామ్రే మోడళ్లను సవాల్ చేస్తూ స్కొడా అందిస్తున్న ఈ 2012 సూపర్బ్ యాంబిషన్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.18.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇకపోతే డీజిల్ వేరియంట్ సూపర్బ్ ధర రూ.23.19 లక్షలుగా ఉంది.

ఇది వరకటి సూపర్బ్ బేస్ వేరియంట్‌లో ఉన్న జెనాన్ హెడ్‌ల్యాంప్‌ల స్థానంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను స్కొడా రీప్లేస్ చేసింది. ఈ కొత్త వేరియంట్‌లో పార్కింగ్ సెన్సార్‌లను తొలగించడమే కాకుండా, టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్ స్థానంలో స్టాండర్డ్ ఆడియో సిస్టమ్‌ను, 6-సిడి ఛేంజర్ స్థానంలో సింగిల్ సిడి వెర్షన్‌ సిడి ప్లేయర్‌ను రీప్లేస్ చేసింది.

కొత్త స్కొడా సూపర్బ్ యాంబిషన్ వేరియంట్ విడుదలతో ఈ మోడల్ వేరియంట్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వివిధ వేరియంట్లలో లభిస్తున్న స్కొడా సూపర్బ్ ఎక్స్-షోరూమ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

1. స్కొడా సూపర్బ్ యాంబిషన్ 1.8 టిఎస్ఐ ఎమ్‌టి (పెట్రోల్) - రూ.18.55 లక్షలు
2. స్కొడా సూపర్బ్ యాంబిషన్ 2.0 టిడిఐ (డీజిల్) - రూ.23.19 లక్షలు
3. స్కొడా సూపర్బ్ ఎలిగాన్స్ 1.8 టిఎస్ఐ ఎమ్‌టి (పెట్రోల్) - రూ.20.20 లక్షలు
4. స్కొడా సూపర్బ్ ఎలిగాన్స్ 1.8 టిఎస్ఐ ఏటి (పెట్రోల్) - రూ.21.75 లక్షలు
5. స్కొడా సూపర్బ్ ఎలిగాన్స్ 2.0 టిడిఐ సిఆర్ ఏటి (డీజిల్) - రూ.24.74 లక్షలు
6. స్కొడా సూపర్బ్ ఎలిగాన్స్ 3.6 వి6 (పెట్రోల్) - రూ.28.74 లక్షలు

More from DriveSpark

Article Published On: Monday, April 16, 2012, 16:35 [IST]
English summary
Skoda has launched the low priced version of its flagship sedan, the Superb Ambition with a starting price of Rs.18.55 lakhs (ex showroom Mumbai). The Skoda Superb Ambition is a stripped down version of the executive sedan with some features missing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+