టైటానిక్‌తో పాటుగా మునిగి, తిరిగి జీవం పోసుకున్న కార్
టైటానిక్ కారు సీన్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది దర్శక మాంత్రికుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రేమ కథా చిత్రం 'టైటానిక్' ఓడలో బేస్‌మెంట్‌లో కార్గో యార్డ్‌లో ఉంచిన ఓ పురాతన కారులో హీరో హీరోయిన్‌ల సరసాలే గుర్తుకు వస్తాయి. అయితే, వాస్తవానికి అసలు టైటానికి ఓడ మునిగిపోయి సరిగ్గా 100 సంవత్సరాలు కావస్తుంది. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఓడగా చరిత్ర సృష్టించిన ఈ టైటానిక్ ఓడ సముద్రంపై తొలి పయనం సాగిస్తున్నప్పుడు ఇందులో అనేక మంది ధనికులు కూడా ప్రయాణం చేశారు.
అలాంటి వారిలో పెన్సస్లవానియాలోని బ్రైన్ మార్‌కు చెందిన విలియం కార్టర్ కూడా ఒకరు. టైటానిక్ ఓడలో ఆయన తన 1912 రెనో టైప్ సిబి కూపే డి విల్లే కారును తనతో పాటుగా యూరప్‌కు తీసుకువెళ్లాలనుకున్నాడు. ఈ వివరాలను షిప్ కార్గో మ్యానిఫెస్టోలో కూడొ పొందుపరచారు. టైటానిక్ ప్రమాదం నుండి భార్య, పిల్లలతో బ్రతికిబయటపడిన విలియమ్ కార్టర్ ఈ కారు గురించి లండన్‌కు చెందిన ఇన్సూరెన్స కంపెనీ ల్లాయడ్స్ వద్ద 5,000 డాలర్లను క్లెయిమ్ చేశాడు.

1985లో రాబెర్ట్ బల్లార్డ్ మునిగిపోయిన టైటానిక్ ఓడను గుర్తించిన తర్వాత, ఈ రెనో టైప్ సిబి కూపె డి విల్లే కారును బయటకు తీశారు. ఈ కారును ఓ చెక్క బాక్సులో ట్రాన్స్‌పోర్ట్ ఈ చేయటం వలన, టైటానిక్ ఓడ ముందు భాగం విరిగిపోయి నేలకు గుద్దుకున్నప్పటీ ఈ కారు మాత్రం చెక్కు చేదరలేదట. సంవత్సరాల పాటు ఈ కారు ఉప్పు నీటిలో ఉన్నప్పటి తుప్ప పట్టకుండా ఉండటం విశేషం.
ఇంత గొప్ప కారును రూపొందించినందుకు ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనోకు ఓ ప్రత్యేక గుర్తింపు కూడా లభించినట్లయింది. మునిగిపోయిన టైటానిక్ ఓడ నుండి ఈ కారును బయటకు తీసిన తర్వాత రెనో అదే కలర్ పెయింట్‌ను వేసి కొత్తదానిలా తీర్చిదిద్ది వేలానికి ఉంచింది. 2003లో ప్రముఖ వేలం సంస్థ నిర్వహించిన ఓ వేలంలో ఇది 2,69,500 డాలర్ల వెల పలికింది.


Click it and Unblock the Notifications








