బీజింగ్ ఆటో షోలో తళుక్కుమన్న ఫియట్ వియాజియో
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్, అమెరికన్ కార్ కంపెనీ క్రిస్లర్‌లు చైనాలో రూపొందించిన తొలి కారు "ఫియట్ వియాజియో"ను కంపెనీ నేడు ప్రపంచానికి పరిచయం చేసింది. గత కొద్ది రోజుల క్రితమే ఈ కంపెనీ ఓ ఫియట్ వియాజియో టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
నేడు (ఏప్రిల్ 23, 2012) ప్రారంభమై ఈ అంతర్జాతీయ ఆటో షోలో వివిధ కార్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నాయి. విశిష్టమైన పవర్, మెరుగైన మైలేజ్, అధునాత టెక్నాలజీ, అందమైన లుక్, ఆకర్షనీయమైన ఇటాలియన్ డిజైన్ వంటి ప్రత్యేకతలతో ఫియట్ వియాజియోను రూపొందించామని కంపెనీ పేర్కొంది.
ఫియట్-క్రిస్లర్ జాయింట్ వెంచర్ నుండి వస్తున్న ఈ మేడ్ ఇన్ చైనా ఫియట్ వియాజియోలో 1.4 లీటర్ టిజెట్ టర్బో-ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించారు. ఇందులో ఓ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని, మరొక ఇంజన్ 150 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో పాటుగా ఫియట్ పవర్‌ట్రైన్స్ తాజాగా అభివృద్ధి చేసిన డ్యూయల్ డ్రై క్లచ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (డిడిసిటి) ఆప్షన్‌తో కూడా లభించనుంది.
ఫియట్ వియాజియో 4,679 మి.మీ. పొడవును, 1,850 మి.మీ. వెడల్పును, 2,708 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఫియట్ వియాజియో సెడాన్‌ను ప్రస్తుత సంవత్సరం మూడవ త్రైమాసికంలో తొలుత చైనాలో, ఆపై ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయాలని ఫియట్ యోచిస్తోంది. ఇండియన్ మార్కెట్‌కు కూడా ఈ ఫియట్ వియాజియో సెడాన్ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications









