యూరస్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన లాంబోర్గినీ
సూపర్ కార్లు, స్పోర్ట్ కార్లు మాత్రమే తయారు చేసే కార్ కంపెనీ తొలిసారిగా ఎస్‌యూవీని తయారు చేస్తే ఎలా ఉంటుంది. రచ్చ రచ్చే.. కదూ..!! ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే సూపర్ కార్లను తయారు చేసే 'లాంబోర్గినీ' తొలిసారిగా ఓ ఎస్‌యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికల్)ని రూపొందించింది.
ప్రస్తుతం చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న 2012 ఆటో షోలో 'యూరస్' (Urus) అనే పేరుతో లాంబోర్గినీ రూపొందించిన ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.
సాలిడ్ బాడీ, స్టన్నింగ్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ మేకర్ డిజైన్ చేసిన 'యూరస్' కాంపాక్ట్ సూపర్ స్టైలిష్ ఎస్‌యూవీలో 600 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను కలిగి ఉండి, గంటకు గరిష్టంగా 180 మైళ్ల వేగం (గంటకు 289.68 కి.మీ.)తో పరుగులు తీస్తుంది.
ఇది కేవలం 5.4 అడుగుల ఎత్తును, 6.5 అడుగుల వెడల్పును, 16.4 అడుగుల పొడవను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని తేలికగా ఉంచేందుకు గానూ దీని తయారీలో కార్బన్ ఫైబర్ రీఫైన్డ్ పాలిమర్‌ను ఉపయోగించారు (అందుకే అంత వేగం). లాంబోర్గీనీ యూరస్ 2016 నాటికి మార్కెట్లో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. యూరస్ ఎస్‌యూవీని ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో రూపొందించారు.


Click it and Unblock the Notifications









