బీజింగ్‌లో పల్సర్ స్మాల్ సెడాన్‌ను ఆవిష్కరించిన నిస్సాన్
ఆస్ట్రేలియన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని పల్సర్ సెడాన్‌ను రూపొందించామని నిస్సాన్ పేర్కొంది. ప్రారంభ దశలో భాగంగా, పల్సర్ సెడాన్ రూపంలో విక్రయించబడుతుందని, 2013లో ఇందులో ఓ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తామని నిస్సాన్ పేర్కొంది. నిస్సాన్ పల్సర్ చూడటానికి చిన్న కారే అయినప్పటికీ, ఇందులో ఎల్ఈడి టెయిల్ బోర్డెడ్ హెడ్‌లైట్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ విండో సిల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయెల్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి సదుపాయాలున్నాయి.
నిస్సాన్ పల్సర్ సెడాన్‌లో 1.8 లీటర్, ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీనికి ఆటోమేటిక్ సివిటి గేర్‌బాక్స్‌ను జోడించారు. సాంప్రదాయ ఇంజన్ల ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. అయితే, పల్సర్ స్మాల్ సెడాన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేది లేనిది నిస్సాన్ స్పష్టం చేయలేదు. భారత విపణిలో నిస్సాన్ మరింత మార్కెట్ వాటాను దక్కించుకోవాలంటి ఇలాంటి ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications









