సరికొత్త ఏ4 సెడాన్‌ను విడుదల చేసిన ఆడి ఇండియా

జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-లెవల్ లగ్జరీ సెడాన్ 'ఆడి ఏ4' ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడి ఇండియా విడుదల చేసిన 2012 వెర్షన్ ఏ4 సెడాన్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఏ4 సెడాన్న ఎంతో మెరుగ్గా ఉండటమే కాకుండా ధరలో కూడా సుమారు రూ.60,000 వరకూ తక్కువగా ఉండనుంది.

ఆడి ఇండియా కొత్తగా విడుదల చేసిన 2012 ఏ4 సెడాన్ ధరలు రూ.27.33 లక్షల (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర) నుండి రూ.38 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. ఆడి ఇండియా విడుదల చేసిన ఈ సరికొత్త ఏ4 సెడాన్ 8వ తరానికి (జనరేషన్) చెందినది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది.


కొత్త ఆడి ఏ4 వేరియంట్లు - ధరలు:
* 2012 ఆడి ఏ4 1.8 లీటర్ టిడిఐ - రూ.27.33 లక్షలు
* 2012 ఆడి ఏ4 2.0 లీటర్ టిడిఐ - రూ.29.38 లక్షలు
* 2012 ఆడి ఏ4 3.0 లీటర్ టిడిఐ - రూ.38.00 లక్షలు

కొత్త ఆడి ఏ4 10 శాతం అధిక మైలేజ్‌ను ఇస్తుంది. దీని ఎక్స్టీరియర్ డిజైన్‌లో కొద్దిపాటి చిన్న చిన్న మార్పులను చేయటం జరిగింది. కారు ముందు వైపు రీడిజైన్ చేయబడిన స్టయిలిష్ ఎల్ఈడి రన్నింగ్ ల్యాంప్స్, మోడిఫై చేయబడిన బానెట్, అలాగే వెనుక వైపు కొత్త రియర్ రూఫ్ స్పాయిలర్, రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ డ్యూయెల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి మార్పులను గమనించవచ్చు.

ఇకపోతే కొత్త ఆడి ఏ4 ఇంటీరియర్స్‌ను మునపటి కన్నా మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. కారు లోపలి వైపు మరింత లగ్జరీ లుక్ అండ్ ఫీల్ అనుభూతిని కల్పించేందుకు అక్కడక్కడా క్రోమ్ డిజైన్, విశాలమైన క్యాబిన్ స్పేస్, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి మార్పులను పరిశీలించవచ్చు. 2012 ఆడి ఏ4 సెడాన్‌లో ఎలక్ట్రోమెకానికల్ స్టీరింగ్, డ్రైవ్ సెలక్ట్ ఫీచర్లు ప్రధాన మార్పులుగా చెప్పుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, May 3, 2012, 17:20 [IST]
English summary
German luxury carmaker Audi has launched the facelifted A4 2012 mid-level luxury sedan between Rs 27.33-38 lakh (ex-showroom, Maharashtra). Interestingly, the new A4 is about 60k cheaper than the outgoing model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+