జెనీవాలో థర్డ్ జనరేషన్ ఏ3 సెడాన్‌ను ఆవిష్కరించిన ఆడి

జర్మన్ లగ్జరీ కార్ ఆడి అందిస్తున్న ఏ3 సెడాన్‌లో నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను జెనీవాలో జరుగుతున్న 82వ అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించింది. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పోలో నుండి పస్సాట్ రేంజ్ వరకూ కార్లను తయారు చేసిన ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే తొలిసారిగా నెక్స్ట్ జనరేషన్ ఆడి ఏ3 సెడాన్‌ను రూపొందించడం జరిగింది. పాత జనరేషన్ ఏ3 సెడాన్ కన్నా ఇది 80 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది.

ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌పై కార్లను తయారు చేయటం తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాకుండా, ఇన్వెంటరీని కూడా తగ్గిస్తుండటంతో ఆడి బ్రాండ్ కూడా తొలిసారిగా ఈ ఫ్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించింది. కొత్త తరం ఆడి ఏ3 సెడాన్‌ రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అందులో మొదటిది 121 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే 1.4 లీటర్ ఇంజన్, మరొకటి 178 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే 1.8 లీటర్ ఇంజన్.

ఇందులో 1.8 లీటర్ ఇంజన్ కలిగిన ఆడి ఏ3 సెడాన్ సెవన్ స్పీడ్ ట్విన్-క్లచ్, ఎస్-ట్రానిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించగా, 1.4 లీటర్ ఇంజన్ కలిగిన ఆడి ఏ3 సెడాన్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించనుంది. ఇందులో 1.6 లీటర్ ఇంజన్ వేరియంట్‌ను కూడా ఆడి విడుదల చేసే అవకాశం ఉంది. ఇక లుక్స్ పరంగా గమనిస్తే పాత వెర్షన్ కన్నా కొత్త వెర్షన్ ఆడి ఏ3 షార్ప్‌గా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 6, 2012, 19:15 [IST]
English summary
German luxury car maker Audi has unveiled the A3 sedan concept at 82nd Geneva Motor Show. This is third generation of A3 sedan. The all-new Audi A3 sedan is 80 kg lighter than the previous generation A3.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+