త్వరలోనే కార్లకు మైలేజ్ రేటింగ్ విధానం ఖరారు: బీఈఈ

ఇప్పటి వరకూ టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసిలు వంటి గృహోపకరణాలకు ఖర్చయ్యే విద్యుత్తును తెలిపేందుకు వాటిపై స్టార్ రేటింగ్‌ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. అదేవిధంగా ఇక నుండి కార్లపై వాటి మైలేజ్‌ను తెలిపే విధంగా స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. ఇంధన సామర్థ్య (ఫ్యూయెల్ ఎఫీషిన్సీ) రేటింగ్‌‌ను ఇవ్వటం ద్వారా సదరు వాహనం మైలేజ్‌ను తెలుసుకోవచ్చు.

దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఓ ప్రతిపాదనను కూడా చేసింది. ఈ నిబంధనలపై త్వరలోనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా కొత్తగా కారు కొనాలనుకుంటే, మొదటిగా ఆలోచించేది మైలేజ్ గురించే. అయితే, కార్ మేకర్లు చూపించే మైలేజ్‌కు వాస్తవ పరిస్థితుల్లో వచ్చే మైలేజ్‌కు భారీ వ్యత్యాసం ఉంటుంది.

ఈ మైలేజ్ రేటింగ్ విధానంతో మైలేజ్ విషయంలో ఉన్న సంశయాలకు తెరపడనుంది. ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబిలింగ్ రూల్స్‌ను బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) రూపొందించింది. ఈ మార్గదర్శకాల ఖరారు చేయటం దాదాపుగా పూర్తయిందని, వివిధ అంశాలపై విస్తృతమైన ఏకాభిప్రాయం కుదిరిందని బీఈఈ డెరైక్టర్ జనరల్ అజయ్ మాధుర్ అన్నారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి కార్యాలయంలో ఉంది. ఈ మార్గదర్శకాలను రూపొందించడంలో విద్యుత్, భారీ పరిశ్రమలు, రోడ్డు రవాణా, రహదారులు తదితర మంత్రిత్వ శాఖలతో పాటుగా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్ఐఏఎమ్)లు కూడా పాల్గొన్నాయి. త్వరలోనే వాహనాలపై ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబుల్స్‌ను ప్రదర్శించడం తప్పనిసరిగా మారనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 6, 2012, 11:05 [IST]
English summary
Very soon Cars too have a fuel efficiency labels like TV, Fridge, AC etc as the Bureau of Energy Efficiency (BEE), under the Ministry of Power, has prepared the final draft of proposed fuel efficiency standards for passenger cars after extensive deliberations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+