మరికొద్ది గంటల్లో విడుదల కానున్న మహీంద్రా 2012 జైలో
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుండి లభిస్తున్న బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) జైలో ఓ సరికొత్త రిఫ్రెష్డ్, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2012 జైలో మరికొద్ది గంటల్లోనే మార్కెట్లోకి రానుంది. సరికొత్త జైలో డిజైన్‌లోనూ, ఇంటీరియర్స్‌లోనూ అనేక మార్పులు ఉండబోతున్నాయి.
ఈ ఫోటోలో కనిపిస్తున్న కొత్త జైలో స్పైషాట్‌ను గమనించినట్లయితే, జైలో ఫ్రంట్ డిజైన్‌లో చోటుచేసుకున్న మార్పులను గమనించవచ్చు. దీన్నిబట్టి చూస్తే.. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, బంపర్ డిజైన్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, హెడ్‌లైట్ డిజైన్, బాడీ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులను గమనించవచ్చు.
జైలో కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్‌ను బట్టి చూస్తుంటే, ఇది తన కొరియన్ భాగస్వామి శాంగ్‌యాంగ్ వాహనాల నుండి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్స్‌లో మార్పులను తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి ఉండక తప్పదు. కొత్త జైలో గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









