లక్షకు పైగా ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ కార్ల రీకాల్
సుమారు లక్షకు పైగా కార్లలో ఈ సమస్యలను గుర్తించామని, ఈ రీకాల్ గురించి వినియోగదారులకు ప్రత్యేకంగా తెలియజేసి, సమస్యలను ఉచితంగా సరిచేసి ఇస్తామని ఫోర్డ్ ఇండియా ప్రకటించింది. వెనుక సస్పెషన్‌లోని రియర్ ట్విస్ట్ బీమ్ (ఆర్‌టిబి), పవర్ స్టీరింగ్ హోస్ (పిఏఎస్) సంబంధిత సమస్యల కారణంగా కంపెనీ ఈ కార్లను రీకాల్ చేస్తోంది.
ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో జనవరి 2008 నుంచి డిసెంబర్ 2012 మధ్య కాలంలో విక్రయించిన సుమారు 1,11,000 ఫిగో, క్లాసిక్ కార్లలో ఈ సమస్యలను తనిఖీ చేయనుంది. అలాగే, మొత్తం 17,665 కార్లలో విడిభాగాలను రీప్లేస్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
జనవరి 2008 నుంచి డిసెంబర్ 2012 మధ్య కాలంలో విక్రయించిన ఫిగో, క్లాసిక్ కార్లలో రియర్ ట్విస్ట్ బీమ్‌ను, అలాగే సెప్టెంబర్ 2010 నుంచి ఫిబ్రవరి 2011 మధ్య కాలంలో విక్రయించిన అని ఫిగో, క్లాసిక్ పెట్రోల్ వెర్షన్ కార్లలో పవర్ స్టీరింగ్ హోస్‌ను తనిఖీ చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఫోర్డ్ రీకాల్ చేసిన కార్ల సంఖ్య ఇండియాలో కంపెనీ వార్షిక విక్రయాల సంఖ్య కన్నా ఎక్కువ.


Click it and Unblock the Notifications









