లక్ష రూపాయల కారు లక్ష రూపాయల డైమండ్ నక్లెస్ ఫ్రీ

అక్కడ మన లక్ష రూపాయల కారు టాటా నానోపై లక్ష రూపాయల విలువైన డైమండ్ నక్లెస్ ఉచితంగా లభిస్తోంది. అదెక్కడబ్బా అనుకుంటున్నారా.. ఖచ్చితంగా మన దేశంలో మాత్రం కాదులెండి. టాటా మోటార్స్ గడచిన సంవత్సరం జూన్ నెలలో టాటా నానో కారును పొరుగు దేశమైన నేపాల్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ప్రస్తుతం వ్యాలంటైన్స్ డే సీజన్ నడుస్తుండటంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు తమ బుజ్జి కారు నానోపై లక్ష నేపాలీ రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన నక్లెస్‌ను టాటా మోటార్స్ అధీకృత డిస్ట్రిబ్యూటర్ సిప్రాడి ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉండనుంది.

నేపాల్ మార్కెట్లో ఆ దేశ కరెన్సీ ప్రకారం టాటా నానో ధర 7.98 లక్షల ఎన్‌పిఆర్‌లు (నేపాల్ రూపీ)గా ఉంది. మన దేశ కరెన్సీతో పోలిస్తే దీని విలువ సుమారు. రూ. 4.94 లక్షలు. భారత్‌ నుండి నేపాల్‌కు దిగుమతి చేసుకునే కార్లపై 240 శాతం కస్టమ్స్‌, ఇన్సూరెన్స్‌, ఇతర పన్నుల కారణంగా నానో కారు ధర ఇంత అధికంగా ఉంటుంది.

ఈ ఆఫర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:

ఇదిలా ఉండగా.. మాకు అందిన మార్కెట్ సమాచారం ప్రకారం, ఇండియా లభిస్తున్న టాటా నానో కారుపై, కంపనీ డీలర్లు రూ.10,000 వరకూ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ఫిబ్రవరి నెల మొత్తం పాత కారును లేదా బైక్‌ను ఎక్సేంజ్‌ చేసుకునే వారికి, పాత వాహన విలువకు అదనంగా బైక్‌పై రూ.20,000, కారుపై రూ.25,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, February 11, 2012, 13:36 [IST]
English summary
Nano Celebrates the Season of Love. This Valentine, cupid's coming on four wheels with gifts that SPARKLE. Get a sparkling diamond necklace worth Nrs.100,000/- gift with every Nano bought in the month of love :) Hurry! the offer ends on 14th February, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+