రాష్ట్ర మార్కెట్లోకి విచ్చేసిన మహీంద్రా సరికొత్త 2012 జైలో

యుటిలిటీ వాహనాలను తయారు చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేత బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త రిఫ్రెష్డ్ జైలో ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్) ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. కొత్త 2012 వెర్షన్ జైలోలోను కంపెనీ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది.

పాత జైలోతో పోల్చుకుంటే దాదాపు 50 మార్పులు కొత్త జైలోలో ఉంటాయని కంపెనీ వివరించింది. తెలిపింది. 2012 వెర్షన్ జైలో ఎమ్‌పివి డి2, డి4, ఈ4, ఈ8, ఈ9 అనే ఐదు వేరియంట్లలో, ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభించనుంది. రాష్ట్ర మార్కెట్లో కొత్త జైలో ధరలు రూ.7.37 లక్షల నుండి రూ.10.24 లక్షల మధ్యలో ఉన్నాయి. మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది.

కొత్త మహీంద్రా జైలో ఈ9 వేరియంట్‌లో స్కార్పియోలో ఉపయోగించే 2.2లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది 120 బిహెచ్‌పిల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, ఈ4, ఈ8 వేరియంట్లలో ఉపయోగించిన 2.5 లీటర్ ఎమ్ఈగల్ ఇంజన్ 112 బిహెచ్‌పిల శక్తిని, డి2, డి4 వేరియంట్లలో ఉపయోగించిన ఎమ్‌డిఐ ఇంజన్ 95 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

ఐదు వేరియంట్లలో లభ్యమయ్యే కొత్త జైలో ఎమ్‌పివి వేరియంట్‌ను బట్టి లీటరుకు 13-15 కి.మీ. మైలేజీనిస్తుంది. కొత్త జైలో డిజైన్ మార్పు కోసం రూ.50 కోట్లు వెచ్చించామని, యుటిలిటీ వాహనాల మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రాకు 27 శాతం మార్కెట్ వాటా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త జైలోకు మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 11, 2012, 12:35 [IST]
English summary
The new Mahindra Xylo is here. India's leading SUV manufacture has unveiled the latest version of its best selling MPV in Hyderabad. The new Xylo carries forward what the old model excelled in. It has the same masculine stance and loads of interior space.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+