డ్రైవర్‌తో మాట్లాడే కారు: జైలోలో వాయిస్ కమాండ్ టెక్నాలజీ
మహీంద్రా జైలో టాప్-ఎండ్ వేరియంట్ ఈ9లో భారత్‌లోనే తొలిసారిగా వాయిస్ కమాండ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది డ్రైవర్ ఆదేశాల ప్రకారం పనిచేస్తుంది. వైపర్ ఆన్/ఆఫ్ చేయడం, హెడ్‌లైట్లు ఆన్/ఆఫ్ చేయడం, హజార్డ్ లైట్లు ఆన్/ఆఫ్ చేయడం, డోర్లు లాక్ చేయడం/అన్‌లాక్ చేయడం, సౌండ్ తగ్గించడం/పెంచడం, సాంగ్ లేదా ఎఫ్ ఛానెల్ మార్చడం వంటివి దాదాపు 30 కమాండ్లను ఇందులో పొందుపరచారు. ఇవే కాకుండా ఇందులో బ్లూటూత్ ద్వారా మిత్రులకు ఫోన్ కూడా చేసుకోవచ్చు.
డ్రైవర్ వద్ద ఉండే బటన్ ప్రెస్ చేసిన పైన తెలిపిన కమాండ్‌లను ఇస్తే, వాహనం ఆటోమేటిక్‌గా ఆ పని చేసుస్తుంది. పెద్ద పెద్ద ఫారిన్ కార్లలో మాత్రమే ఉండే ఇలాంటి వాయిస్ కమాండ్ టెక్నాలజీని తొలిసారిగా మహీంద్రా జైలో ఈ9 వేరియంట్‌లో ప్రవేశపెట్టామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా.. ఈ వాయిస్ కమాండ్ టెక్నాలజీలో డోర్ సరిగ్గా వేయకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వంటి ప్రమాద హెచ్చరికలకు సంబంధించినవి మొత్తం 15 భద్రతా హెచ్చరిక (సెక్యూరిటీ వార్నింగ్స్)లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications









