మహీంద్రా వాహనాలకు కరూర్ వైశ్యా బ్యాంక్ రుణాలు

XUV500
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) వాహనాలకు ఫైనాన్స్ సేవలు అందించే బ్యాంకుల జాబితాలో మరో కొత్త బ్యాంకు వచ్చి చేరింది. తమ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారులకు రుణసదుపాయాన్ని (ఫైనాన్సింగ్) కల్పించాలనే ఉద్దేశ్యంతో కరూర్ వైశ్యా బ్యాంక్‌ (కెవిబి)తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఎమ్ అండ్ ఎమ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కరూర్ వైశ్యా బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 450కి పైగా బ్రాంచ్‌ల ద్వారా తమ వినియోగదారులు వాహన రుణాలు పొందవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఎమ్ అండ్ ఎమ్‌కు దేశవ్యాప్తంగా 250కు పైగా డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. ఈ ఒప్పందంపై కరూర్ వైశ్యా బ్యాంక్ జనరల్ మేనేజర్ కె.వి. రావు, మహీంద్రా అండ్ మహీంద్రా, సౌత్ సెక్టార్ సీనియర్ సేల్స్ మేనేజర్ అతుల్ సిన్హాలు సంతకాలు చేశారు.

ప్యాసింజర్, వాణిజ్య వాహనాల ఫైనాన్సింగ్‌లో కెవిబి తమ కార్యకలాపాలను విస్తరించుకుంటుందని, మహీంద్రా అండ్ మహీంద్రాతో ఒప్పందం కుదర్చుకోవటంతో తమకెంతో సంతోషంగా ఉందని వెంకటరామన్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 11, 2012, 11:12 [IST]
English summary
Mahindra and Mahindra Ltd on Tuesday signed a preferred financier agreement with Karur Vysya Bank (KVB) to help customers avail vehicle finance services from any of its branch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+