మారుతి సుజుకి ఎర్టిగా గురించి మరిన్ని కొత్త విషయాలు

దేశవ్యాప్తంగా మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి (మల్టీ పర్సస్ వెహికల్) ఫీవర్ పట్టుకుంది. దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ నుండి మార్కెట్లోకి వస్తున్న మొట్టమొదటి ఎమ్‌పివి కావడంతో ఈ మోడల్‌పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎర్టిగా ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయంలో ఇప్పటికే దాదాపుగా సంశయాలు, సందేహాలు తీరిపోయినప్పటికీ ధర విషయంపైనే ప్రధానంగా అందరి దృష్టి నెలకొని ఉంది.

సరసమైన ధరకే ఎర్టిగా ఎమ్‌పివి విడుదల చేయాలని మారుతి సుజుకి భావిస్తోంది. ఎర్టిగా ఎమ్‌పివి రేపు (గురువారం, ఏప్రిల్ 12, 2012ఎ) సాయంత్రం 7.00 గంటలకు విడుదల కానుంది. కాగా.. మారుతి సుజుకి ఇండియాకు కూడా ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఉత్పత్తి కావటంతో ఈ మోడల్ ప్రచారంపై కంపెనీ భారీ మొత్తాలనే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. టెలివిజన్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వంటి వివిధ ప్రసార మాధ్యమాలలో ఎర్టిగా ఎమ్‌పివి కోసం భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.

Maruti Suzuki Ertiga Launch Images:

ఎర్టిగా ఎమ్‌పివి కోసం కంపెనీ ఇప్పటికే ఓ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసి, అందులో ఓ టీజర్‌ను విడుదల చేసింది. వినియోగదారుల జీవనశైలిని మరింత మృదుమధురం చేసేందుకు తాము ఎల్‌యూవి (లైఫ్ యుటిలిటీ వాహనం)ను డిజైన్ చేశామని మారుతి సుజుకి తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Maruti Suzuki Ertiga Photo Gallery:

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో ప్రధాన ప్రత్యేకతలు క్రింది విధంగా ఉండనున్నాయి.
* పవర్‌ఫుల్, రెస్పాన్సివ్ ఇంజన్.
* బెటర్ పెర్ఫామెన్స్ కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ.
* ఏడుగురు ప్రయాణికులు (2+3+2) సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించేలా అభివృద్ధి చేసిన డిజైన్.
* అధిక నాణ్యత కలిగిన మెటీరియల్‌తో డిజైన్ చేసిన స్టయిలిష్, హ్యాపీ ఇంటీరియర్స్.
* ఓ కొత్త కార్-కేటగిరీని సృష్టించేలా డిజైన్ చేసిన సరికొతిత స్పోర్టీ బాడీ డిజైన్. మారుతి సుజుకి నుండి రానున్న ఈ ఎల్‌యూవి సిటీ ప్రయాణాల నుండి దూర ప్రయాణాల వరకూ మీ అన్ని రవాణా అవసరాలను తీర్చుతుందని కంపెనీ అంటోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 11, 2012, 13:27 [IST]
English summary
Maruti Suzuki Ertiga will be launched Tomorrow (April 12, 2012). Here is more updates about the all new Ertiga. Ertiga is here to enhance your lifestyle. A powerful, responsive engine. Advanced technology for better performance. Ergonomically designed 5+2 flexi-seating. Stylish, happy interiors with high quality upholstery. All come together in a sporty body design to create a new car-category. From rush-hour driving to midnight spins and long drives, LUV is here to transform it all.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+