ఫోక్స్‌వ్యాగన్ వెంటోలో మరో కొత్త డీజిల్ వేరియంట్‌ను విడుదల
జర్మన్ ఆటో మేజర్ ఫోక్స్‌వ్యాగన్ నుండి ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ సెడాన్ 'వెంటో' డీజిల్ వెర్షన్‌లో మరో కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం వెంటో డీజిల్ వెర్షన్ కేవలం ట్రెండ్‌లైన్, హైలైన్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఈ రెండు వేరియంట్లకు మధ్యలో ఓ మిడ్ వేరియంట్ "కంఫర్ట్‌లైన్" ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసింది.
ఫోక్స్‌వ్యాగన్ వెంటో కంఫర్ట్‌లైన్ డీజిల్ వేరియంట్ ధర రూ.8.56 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉంది. 2012 వెర్షన్ వెంటో కంఫర్ట్‌లైన్ డీజిల్ వేరియంట్‌లో కీలక ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి:
- కారు బాడీ రంగులో ఉండే డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్స్
- రేడియో, సిడి, ఎమ్‌పి3 ప్లేయర్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్
- వెనుకపై అమర్చిన సెంటర్ ఆర్మ్ రెస్ట్
- ముందు వైపు, వెనుక వైపు అమర్చిన ఫాగ్ ల్యాంప్స్
- డ్రైవర్ ఎత్తుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోగల అడ్జస్టబిల్ సీట్
- యాంత్రికంగా నియంత్రించబడే రియర్ వ్యూ మిర్రర్స్
కంఫర్ట్‌లైన్ వేరియంట్లో కూడా 1.6 లీటర్ టిడిఐ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 105 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది ఫోక్స్‌వ్యాగన్ వెంటో పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో కూడిన వేరియంట్ కూడా లభిస్తుంది.


Click it and Unblock the Notifications









