అమెరికాకు వెళ్లనున్న సరికొత్త నానో, ఎలక్ట్రిక్ నానో!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న చవక కారు టాటా నానోను వీలైనంత త్వరగా అమెరికా మార్కెట్లోకి తీసుకువెళ్లాలని టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తుంది. టాటా మోటార్స్ కంపెనీకు ప్రపంచ స్థాయిలో విస్తృతమైన గుర్తింపు కల్పించేందుకు, అంతర్జాతీయంగా గట్టి పోటీని ఇచ్చేందుకు కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంలో తాజాగా పెట్టుబడులను వెచ్చించడం జరిగింది.
అమెరికా వెర్షన్ టాటా నానో పూర్తిగా మెరుగైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో లభించే అవకాశం ఉంది. ఇందులో శక్తివంతమైన ఇంజన్‌తో పాటుగా అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అంచనా వేయచవచ్చు. టాటా నానో ఎలక్ట్రిక్ కారును కూడా అమెరికాలో విడుదల చేయనున్నట్లు సిడ్నీ హెరాల్డ్‌తో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా వెల్లడించారు.
సుమారు. 7,000 అమెరికన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.3.50 లక్షలు) ప్రారంభ ధరతో ఈ కారును అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇండియాలో బర్నింగ్ కారుగా ముద్ర వేసుకున్న టాటా నానో, అత్యంత కఠినమైన అమెరికా భద్రతా నిబంధనలు పాటించడంలో సక్సెస్ అవుతుందో లేదో, ఈ కారును అమెరికన్లు ఆహ్వానిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది. మీరేమంటారు...?


Click it and Unblock the Notifications









