మారుతి ఎర్టిగాకు మహారాష్ట్ర నుండి 800 బుకింగ్స్
దేశపు అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్, అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుండి లభిస్తున్న మొట్టమొదటి ఎమ్‌పివి కావటంతో ఎర్టిగాపై వినియోగదారులు భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. ఈ మోడల్‌పై కొనుగోలుదారులు ఉంచిన విశ్వాసం కారణంగానే ఇది మార్కెట్లో విడుదల కాకముందే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈనెల 12వ తేదీన మార్కెట్లోకి విడుదలైన ఎర్టిగా ఒక్క రోజులోనే మహారాష్ట్ర నుండి 800 బుకింగ్‌లను దక్కించుకుంది. విడుదలకు ముందే మహారాష్ట్ర నుండి 400 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి అధిక సంఖ్యలో విచారణలు కూడా వస్తున్నాయని కంపెనీ కమర్షియల్ బిజినెస్ హెడ్ (వెస్టర్న్ రీజియన్) ఎస్ ఎన్ బర్మన్ తెలిపారు.
మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, ఎప్పటికప్పుడు తాజా ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకే మారుతి సుజుకి ఈ ఎమ్‌పివిని విడుదల చేసింది. కేవలం రూ.5.89 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కే ఎర్టిగా పెట్రోల్ వేరియంట్‌ను, రూ.8.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కే డీజిల్ వేరియంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
హైదరాబాద్‌లో ఎర్టిగా ఎమ్‌పివి ఎక్స్-షోరూమ్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* Maruti Ertiga LDi BS IV - Rs.759771.89
* Maruti Ertiga LXi BS IV - Rs.616261.44
* Maruti Ertiga VDi BS IV - Rs.820838.55
* Maruti Ertiga VXi BS IV (ABS) - Rs.696665.88
* Maruti Ertiga VXi BS IV - Rs.688523.67
* Maruti Ertiga ZDi BS IV - Rs.876819.84
* Maruti Ertiga ZXi BS IV - Rs.759771.60


Click it and Unblock the Notifications









