రాష్ట్ర మార్కెట్లో ఎర్టిగాను విడుదల చేసిన మారుతి సుజుకి

ఓ సాధారణ కారు ధరకే యుటిలిటీ వాహనంలోని సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా రూపొంగించిన మొట్టమొదటి బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) ఎర్టిగానూ కంపెనీ రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. రాష్ట్ర మార్కెట్లో ఎర్టిగా ఎమ్‌పివి ధరలు రూ.6.16 లక్షల నుండి రూ.8.76 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

రాష్ట్ర మార్కెట్లో ఎర్టిగా ఎమ్‌పివి మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంజనీరింగ్) ఐ.వి. రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కారును భారత పరిస్థితులను, పట్టణాల్లో నివసించే భారతీయ కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేశామని, ఇది ఎస్‌యూవీ మాదిరిగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాకుండా, ఓ సెడాన్ కన్నా సౌకర్యమైన, విశాలమైన అనుభూతిని కల్పిస్తుందని ఆయన అన్నారు.

ఎర్టిగా ఎమ్‌పివి ఏడు ఆకర్షణీయమైన రంగుల్లో ఆరు వేరియంట్లలో (3 పెట్రోల్, 3 డీజిల్) లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా లీటరుకు 16 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిదా 20.77 కి.మీ. మైలేజీనిస్తుందని ఆయన వెల్లడించారు. ఇది ఇతర వాహనాలతో పోల్చుకుంటే 40 శాతం అధికమని, దీని తక్కువ బరువు, శక్తివంతమైన ఇంజన్ కారణంగా ఇది మంచి పెర్ఫామెన్స్‌ను అందిస్తుందని రావు తెలిపారు.

హైదరాబాద్‌లో ఎర్టిగా ఎమ్‌పివి ఎక్స్-షోరూమ్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* మారుతి సుజుకి ఎర్టిగా ఎల్‌డిఐ బిఎస్ 4:- రూ.759771.89
* మారుతి సుజుకి ఎర్టిగా ఎల్ఎక్స్ఐ బిఎస్ 4:- రూ.616261.44
* మారుతి సుజుకి ఎర్టిగా విడిఐ బిఎస్ 4:- రూ.820838.55
* మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ (ఏబిఎస్) బిఎస్ 4:- రూ.696665.88
* మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ఐ బిఎస్ 4:- రూ.688523.67
* మారుతి సుజుకి ఎర్టిగా జెడ్‌డిఐ బిఎస్ 4:- రూ.876819.84
* మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ బిఎస్ 4:- రూ.759771.60

More from DriveSpark

Article Published On: Saturday, April 14, 2012, 14:54 [IST]
English summary
Maruti Suzuki has launched the Ertiga MPV in Hyderabad with a mouth watering price tag. The Maruti Suzuki Ertiga has a starting price of Rs.6.16 lakhs for the entry level petrol variant and Rs.7.58 lakhs for the diesel variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+