లగ్జరీ బస్సు డివోను విడుదల చేసిన టాటా మోటార్స్
పూర్తి ఎయిర్ కండిషనింగ్‌తో కూడిన విలాసవంతమైన బస్సు ఖరీదు రూ.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, థానే)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది.ఉండనున్నాయి. డివో బస్ డిజైన్ కాంపోనెంట్‌ను టాటా మోటార్స్ స్పెయిన్ అనుబంధ సంస్థ హిస్పానో కారెసెరా నుండి సంగ్రహించారు. గడచిన సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన 'బస్ అండ్ స్పెషల్ వెహికల్ ఎక్స్‌పో'లో టాటా మోటార్స్ తమ లగ్జరీ బస్ డివో ప్రదర్శనకు ఉంచింది.
డివో బస్సులో విభిన్నమైన సీటింగ్ లేఅవుట్స్, ప్రయాణికుడి సౌకర్యానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సెమీ-స్లీపర్ అండ్ సీటర్ కాన్ఫిగరేషన్, విశాలమైన సీట్లు, హెడ్ ఫ్లాప్స్, ఆర్మ్‌రెస్ట్‌లు వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇంకా ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, రిఫ్రిజరేటర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, డెస్టినేషన్ బోర్డ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇందులో 285 హెచ్‌పి కమ్మిన్స్ ఇంజన్‌ను అమర్చారు. అధిక మైలేజ్ కోసం ఇందులో 6-స్పీడ్ ఓవర్‌డ్రైవ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.
ఇదే కాకుండా టాటా మోటార్స్ మరో సిటీ బస్సును కూడా విడుదల చేసింది. రూ.15 లక్షల ధరతో స్టార్‌బస్ ఆల్ట్రా పేరుతో ఈ సిటీ బస్సును అందిస్తుంది. ఇది లగ్జరీ, స్టాండర్డ్, స్కూల్ మరియు డీలక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం దీనిని రూపొందించడం జరిగింది. ఈ వేరియంట్లు 22-26 సీట్లతో, విభిన్న వీల్‌బేస్ ఆప్షన్‌లతో లభ్యమవుతాయని కంపెనీ పేర్కొంది. ఈ రెండు మోడశళ్లు బిఎస్ (భారత్ స్టేజ్) 3 వెర్షన్‌లో లభ్యమవుతాయి.


Click it and Unblock the Notifications









