సాధారణ స్థితికి చేరుకున్న బ్రయో, పెండింగ్ డెలివరీలు క్లియర్

అయితే, ప్రస్తుతం తమకు విడిభాగాల సమస్య తొలగిపోయిందని, భారత్‌లో తిరిగి పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించామని, గ్రేటర్ నోయిడాలో ప్లాంటులో కార్ల తయారీ సాధారణ స్థితికి చేరుకుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే వెయిటింగ్ పీరియడ్‌లో ఉన్న అన్ని హోండా బ్రయో బుకింగ్‌లను మార్చిలోగా క్లియర్ చేస్తామని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ అన్నారు. ఈ ప్లాంటులో నిన్నటి (బుధవారం) నుండి రెండు షిఫ్ట్‌ల్లో కార్ల తయారీ ప్రారంభమైందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఈ ప్లాంటులో రోజుకు 370 కార్లను తయారవుతండగా, వచ్చే వారానికి ఈ సంఖ్యను 440 యూనిట్లకు పెంచనున్నారు. అయితే, కంపెనీ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ ఉత్పత్తి మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ నెల గడిస్తే కానీ దీని ఉత్పత్తి గురించి ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేమని కంపెనీ అంటోంది.


Click it and Unblock the Notifications








