ఎస్‌యూవీ సెగ్మెంట్లో 15% మార్కెట్ వాటా సాధిస్తాం: టాటా

టాటా గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ విభాగం టాటా మోటార్స్ దేశీయ యుటిలిటీ వాహన మార్కెట్లో భారీ వాటాను చేజిక్కుంచుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) అమ్మకాల్లో 15 శాతం మార్కె ట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు టాటా మోటార్స్ యుటిలిటీ వెహికల్స్ ప్రోడక్ట్ గ్రూప్ హెడ్ అశేష్ ధార్ వెల్లడించారు.

గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటా 13 శాతంగా ఉందని ఆయన చెప్పారు. టాటా మోటార్స్ మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 10 శాతం నుంచి 12 శాతానికి పెరగనుందని, 2010-11లో 41,000 యుటిలిటీ వాహనాలను విక్రయించామని అశేష్ తెలిపారు. ఇటీవల టాటా మోటార్స్ దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త సుమో గోల్డ్‌ను ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

తొలిసారిగా టాటా సుమోను 1994లో మార్కెట్లోకి తీసుకురావటం జరిగిందని, ఆ తర్వాతి కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ మార్పులు చేర్పులు చేస్తూ అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. గతంలో సుమో అమ్మకాలు నెలకు 1,100 యూనిట్లుగా ఉండే, సుమో గోల్డ్ రాకతో ఈ సంఖ్య 3,300కు పెరిగిందని, గతేడాది 18,000 సుమోలను విక్రయించగా, ఈ ఏడాది 30,000కు పైగా విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, February 16, 2012, 15:38 [IST]
English summary
Tata Motors Ltd is eyeing to increase its UV market share up to 15 per cent this fiscal, up from 13 per cent it registered last year. “The growth has been fuelled by growing volumes from SUV Safari and Sumo, with the latter now notching up average sales of about 3,300 a month, up from about 1,100 it was registering before the launch of Sumo Gold. The Sumo Gold was rolled out in select markets in October 2011 and within 30 days we will take it pan-India,” Mr Ashesh Dhar, Head-Utility Vehicle Product Group, Tata Motors Ltd, said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+