రాష్ట్ర మార్కెట్లోకి సుమో గోల్డ్‌ను విడుదల చేసిన టాటా

Sumo Gold
టాటా మోటార్స్ లిమిటెడ్ నుండి అత్యంత పాపులర్ అయిన బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌యూవీ) టాటా సుమోలో కంపెనీ ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ "టాటా సుమో గోల్డ్"ను గడచిన నవంబర్ నెలలో దేశీయ విపణిలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ కొత్త టాటా సుమో గోల్డ్ రాష్ట్ర మార్కెట్లో కూడా విడుదలయ్యింది.

మారుతున్న వినియోగదారుల అభిరుచులను, యువకుల ఇష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ సరికొత్త సుమో గోల్డ్‌ను అభివృద్ధి చేశామమని కంపెనీ పేర్కొంది. ఇది జిఎక్స్, ఈఎక్స్, ఎల్ఎక్స్, సిఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. ఎంట్రీ లెవల్ టాటా సుమో గోల్డ్ ధర రూ.5.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీలో 3-లీటర్ టర్బోచార్జ్‌డ్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 80 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. పాత వెర్షన్ టాటా సుమోలో ఉపయోగించిన ఇంజన్ కన్నా ఇది మరింత శక్తివంతమైనది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం కొత్త సుమో గోల్డ్ ఎమ్‌యూవీ ప్రతి లీటరుకు 14.07 కి.మీ. మైలేజీనిస్తుంది.

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అమర్చిన మెరుగైన సస్పెన్షన్, సరికొత్త ఫ్రంట్ లుక్, కొత్త హెడ్‌ల్యాంప్స్, బంపర్, గ్రిల్‌పై క్రోమ్ కోటింగ్ కలిగిన టాటా లోగో, సరికొత్త గ్రిల్ డిజైన్, ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కప్ హోల్డర్స్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, వెనుకవైపు అమర్చిన వైపర్, మడుచుకునేందుకు వీలుగా అమర్చిన వెనుక సీట్లు వంటి ఎన్నో మార్పులు ఈ కొత్త సుమో గోల్డ్‌లో చేయబడ్డాయి.

ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ఈ సరికొత్త టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీ 36 నెలలు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. మహీంద్రా బొలెరో, చెవర్లే తవేరా నియో3 మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 16, 2012, 10:45 [IST]
English summary
Tata Motors has launched a refreshed version of its MUV Tata Sumo renamed as a Tata Sumo Gold in Hyderabad with a price tag of Rs. 5.38 Lakhs, ex-showroom Hyderabad. The 3 liter turbocharged common rail diesel engine will produce 80 Bhp power and 250Nm torque.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+