డీజిల్ కార్లపై అదనపు పన్నును వ్యతిరేకిస్తున్న ఆటో రంగం
ప్రస్తుత బడ్జెట్‌లో డీజిల్ కార్లపై అధిక సుంఖాలను, డీజిల్ ధరలను సవరించవచ్చనే వచ్చనే వాదనలు వినిపిస్తుండటం, ఇదే సమయంలో యూరప్ నుండి దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతి సుంఖాలను భారీగా తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో భారత ఆటోమొబైల్ రంగం తీవ్ర నిరసనలను వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో డీజిల్ కార్లపై అధిక సుంఖాలను విధించడాన్ని ఆటో సెక్టార్ వ్యతిరేకిస్తోంది. ఈ బడ్జెట్‌లో డీజిల్ కార్లపై అధిక సుంఖాలను విధించినట్లయితే, కార్ మేకర్లపై ఒక్కొక్క డీజిల్ తయారీకి గానూ అధనంగా రూ.80,000 వరకూ భారం పడనుంది. ఫలితంగా డీజిల్ కార్ల ధరలు కూడా లక్ష రూపాయల మేర పెరిగే అవకాశం ఉంది.
అలాగే, డీజిల్ ధరలను కూడా పెంచాలని ప్రతిపాదించినట్లయితే, పెట్రోల్ కార్ మార్కెట్ కన్నా జోరు మీదున్న డీజిల్ కార్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవటం ఖాయం. ప్రస్తుతం ఆటో సెక్టార్ భవిష్యత్తు అంతా కూడా బడ్జెట్‌లోని డీజిల్ విధానంపై ప్రభుత్వం ప్రకటించే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications









