ఫోక్స్‌వ్యాగన్ అప్‌ చిన్న కారులో 16 మందికి చోటు

సాధారణంగా ఓ చిన్న కారులో ఎంత మందికి చోటు ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటే నలుగురు లేదా ఐదుగురికి మాత్రమే చోటు ఉంటుంది. కానీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు అప్‌లో మాత్రం ఏకంగా 16 మందికి చోటు దొరికింది. చిన్న కారులో 16 మంది పట్టడమేంటి అనుకుంటున్నారా..?

అసలు విషయం ఏంటంటే, జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు ఎంత విశాలంగా ఉంటుందో తెలిపిందేకు ఓ చిన్న స్టంట్ చేసింది. ఇందులో భాగంగా 15 మంది అందమైన అమ్మాయిలతో పాటు, 1 లక్కీ అబ్బాయ్‌ని ఈ బుజ్జి కారులో సర్దేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫోక్స్‌వ్యాగన్ అప్ కేవలం 139.4 ఇంచ్‌ల పొడవు, 64.6 ఇంచ్‌ల వెడల్పు, 58.3 ఇంచ్‌ల ఎత్తు మాత్రమే కలిగి ఉంటుంది.


గ్లోబల్ మార్కెట్లో ఏ-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ అప్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జర్మన్ టెక్నాలజీ, మెరుగైన మైలేజ్, ఆకట్టుకునే లుక్స్, సౌకర్యవంతమైన ఇంటీర్ స్పేస్ వంటి ప్రధాన ప్రత్యేకతలు ఫోక్స్‌వ్యాగన్ అప్ సొంతం. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ ఈ బుజ్జి కారును ఇండియన్ మార్కెట్‌కు కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఇప్పటికే కొన్ని కార్లను ఇండియన్ రోడ్లపై కంపెనీ టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ టెస్ట్ రన్ విజయవంతంగా పూర్తి కాగానే, భారత మార్కెట్లో వాణిజ్య పరంగా అప్ చిన్న కారును ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చిన్న కార్లకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరా ఈ కారును దేశీయ విపణిలో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఫోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్‌ను తాకవచ్చని అంచనా.

Most Read Articles

English summary
The Volkswagen Up might be a small car and yet as many as 16 people were able to get inside it in Germany. Volkswagen has started testing the Up in India.
Story first published: Wednesday, July 18, 2012, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X